Womens T20 World Cup Sri Lanka : శ్రీలంక రాణిస్తుందా
సత్తా చాటేందుకు లంకేయులు రెడీ
Womens T20 World Cup Sri Lanka : మరో మెగా టోర్నీకి సిద్దమైంది శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు. దాయాది దేశాలు భారత్ , పాకిస్తాన్ తో కలిసి శ్రీలంక కూడా బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఆశించిన మేర ప్రతిభ కనబర్చలేక పోయింది. దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2023 జరగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రెండు గ్రూప్ లుగా ఆడనున్నాయి. ఒక్కో గ్రూప్ లో 5 జట్లు ఉన్నాయి.
ఇక ఈసారి ఎలాగైనా సత్తా చాటి తమ దేశానికి పేరు తీసుకు రావాలని ఉవ్విళ్లూరుతున్నాయి. స్వదేశంలో శ్రీలంక మహిళా జట్టు అడపా దడపా రాణించినా ఆశించిన స్థాయిలో పర్ ఫార్మెన్స్ ప్రదర్శించడం లేదు. ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం జట్టుకు మరింత బలం చేకూర్చేలా సపోర్ట్ చేస్తోంది.
ఓ వైపు దేశం ఆర్థిక ఇబ్బందులో ఉన్నా ఎలాగైనా జట్టును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించేలా చేసింది. ఇక ఈ మెగా టోర్నీలో శ్రీలంక జట్టు(Womens T20 World Cup Sri Lanka) అన్ని ఫార్మాట్ లలో బలంగా కనిపిస్తూనే ఉన్నా.
మైదానంలోకి దిగితే కానీ చెప్పలేం. ఏ జట్టు ఎలా ఆడుతుందో ..ఎవరు గెలుస్తారనేది.ఇక జట్టు పరంగా చూస్తే చమరి అథాపట్టు కెప్టెన్ కాగా ఓషది రణసింగ్, కవిషా దిల్హరి, అనుష్క సంజీవని, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషిణి నుత్యాంగన, మల్షా షెహాని, ఇనోకా రణవీర, సుగండిక కుమారి, అచిని కులసూర్య, సనచ్ది గుణరత్నే, విష్మీ గుణరత్నే ఆడనున్నారు.
Also Read : విండీస్ బిగ్ ఫైట్ కు సై