Womens T20 World Cup England : ఊపు మీదున్న ఇంగ్లాండ్

క‌ప్ పై క‌న్నేసిన టీమ్

Womens T20 World Cup England : దక్షిణాఫ్రికా వేదిక‌గా ఐసీసీ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ జ‌ట్ల‌లో ఒక‌టిగా పేరు పొందింది ఇంగ్లండ్ జ‌ట్టు. ఇప్ప‌టికే ఫుల్ ప్రాక్టీస్ లో నిమ‌గ్న‌మైన ఈ టీమ్ ఎలాగైనా స‌రే వ‌ర‌ల్డ్ క‌ప్ ను స్వంతం చేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

అంతే కాదు ఆ మేర‌కు వ్యూహాలు కూడా ప‌న్నుతోంది. క్రికెట్ ఆట‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ లో ప్ర‌తి ఒక్క‌రు క్రికెట్ ను ఇష్ట ప‌డ‌కుండా ఉండ‌లేరు. ఎందుకంటే ఇది జెంటిల్మెన్ గేమ్ అని కూడా పిలుచుకుంటారు.

ఇది ప‌క్క‌న పెడితే ప్ర‌తిష్టాత్మక‌మైన టోర్నీలో దుమ్ము రేపాల‌ని రెడీ అయ్యింది ఇంగ్లండ్(Womens T20 World Cup England). అన్ని ఫార్మాట్ ల‌లో స‌త్తా చాటుతూ వ‌స్తున్న ఈ జ‌ట్టు ఇప్పుడు ఏ జ‌ట్టునైనా ఎదుర్కొనే స‌త్తా క‌లిగి ఉంది. ఆ మేర‌కు త‌మ జ‌ట్టును అలా ఫామ్ చేసుకున్నారు. ఇందుకు ఈసీబీని అభినందించాలి.

ఇక మెగా టోర్నీ విష‌యానికి వ‌స్తే మొత్తం 10 జ‌ట్లు , 5 జ‌ట్ల చొప్పున రెండు గ్రూపులుగా ఆడ‌తాయి. ఫిబ్ర‌వ‌రి 10 న క్రికెట్ మెగా సంబురం ప్రారంభం అవుతుంది. స‌పారీ వేదిక‌గా జ‌రిగే ఈ టోర్నీలో భారీ ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి.

ఎందుకంటే ఈ టోర్నీ పూర్త‌యిన వెంట‌నే భార‌త్ లో ఉమెన్స్ కు సంబంధించి తొలిసారి ఐపీఎల్ నిర్వ‌హిస్తోంది బీసీసీఐ. ఆయా జ‌ట్ల‌కు చెందిన ఆట‌గాళ్లు ఇప్ప‌టికే పేర్లు కూడా న‌మోదు చేసుకున్నారు. మ‌రో వైపు సెమీస్ కు చేర‌డం ఖాయ‌మ‌ని చెబుతోంది ఇంగ్లండ్ . ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇలా ఉంది.

హీథర్ నైట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, ఆలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్‌స్టోన్, సారా గ్లెన్, అమీ జోన్స్, నాట్ స్కివర్, లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, డాని వ్యాట్, ఇస్సీ వాంగ్, మరియు డానిబ్సన్ .

Also Read : సై అంటున్న బంగ్లాదేశ్

Leave A Reply

Your Email Id will not be published!