INDW vs PAKW : పాకిస్తాన్ తో పోరుకు భార‌త్ సిద్దం

ప్రారంభ‌మైన ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్

INDW vs PAKW  : న్యూజిలాండ్ వేదిక‌గా ఐసీసీ వ‌న్డే విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మైంది. ఇక భారత మ‌హిళా జ‌ట్టు (INDW vs PAKW )చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ తో ఈనెల 6న త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే టీమిండియా త‌న శ‌క్తియుక్తుల్ని ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ద‌మైంది.

ఈ మెగా టోర్నీలో కీవీస్ లోని మౌంట్ మౌంగ‌నూయిలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. పురుషుల కంటే మ‌హిళ‌ల మ్యాచ్ కు ఆద‌ర‌ణ త‌క్కువ‌. అయిన‌ప్ప‌టికీ ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అనే స‌రిక‌ల్లా కొంత ఉత్కంఠ నెల‌కొన‌డం ఖాయం.

ప్ర‌పంచ విమెన్స్ క్రికెట్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగి ఉన్న క్రికెట‌ర్ గా గుర్తింపు పొందింది హైద‌రాబాదీ స్టార్ ప్లేయ‌ర్ మిథాలీ రాజ్. ఈ మెగా లీగ్ పూర్త‌య్యాక త‌న సుదీర్ఘ క్రికెట్ కెరీర్ నుంచి త‌ప్పుకోనుంది.

ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం భార‌త మ‌హిళా జ‌ట్టుకు మిథాలీ రాజ్ నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే నెల రోజుల‌కు పైగా ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది.

పాకిస్తాన్ పై మ‌న మ‌హిళ‌ల జ‌ట్టు ట్రాక్ రికార్డు బాగానే ఉంది. ఇప్ప‌టి దాకా దాయాదిపై 10 వ‌న్డేల్లో విజ‌యం సాధించింది. 11 సార్లు టీ20 మ్యాచ్ లు జ‌రిగితే 10 మ్యాచ్ ల‌లో గెలుపు సాధించింది ఒక మ్యాచ్ లో ఓట‌మి చ‌వి చూసింది.

అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు బ‌లంగా ఉంది. త‌న క‌ల ప్ర‌పంచ‌క‌ప్ తీసుకు రావాల‌ని , అందుకే తాను ఇంత వ‌ర‌కు వేచి చూస్తున్నాన‌ని తెలిపింది మిథాలీరాజ్. ఏడుసార్లు జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొంది మిథాలీరాజ్.

Also Read : మిత్ర‌మా నీ మ‌ర‌ణం బాధాక‌రం

Leave A Reply

Your Email Id will not be published!