WTC 2023 Team India : టెస్టుల్లో పెరిగిన భారత్ ర్యాంక్
నాగ్ పూర్ లో ఆసిస్ పై గ్రాండ్ విక్టరీ
WTC 2023 Team India : నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఇన్నింగ్స్ విజయంతో టాప్ లో నిలిచింది. ఏకంగా 132 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో నాలుగు టెస్టుల సీరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీస్తే రవి చంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. ఇక సిరాజ్ , షమీ చెరో వికెట్ కూల్చారు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో విచిత్రంగా రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీస్తే జడేజా 2 వికెట్లు, షమీ 2 వికెట్లు తీస్తే సిరాజ్ ఒక వికెట్ తీశాడు. అంతే కాదు తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే కట్టడి చేసింది ఆసిస్ ను. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు 400 రన్స్ చేసింది . అనంతరం మైదానంలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 91 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఇదిలా ఉండగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పట్టికలో ఈ విజయంతో భారత్ కు(WTC 2023 Team India) అదనంగా పాయింట్లు లభించాయి. టాప్ లో ఇంకా ఆస్ట్రేలియా కొనసాగుతోంది. భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇంకా ఫైనల్ కు చేరుకోవాలంటే మరో అడుగు దాటాల్సి ఉంది.
ప్రస్తుతం భారత జట్టు 58.93 శాతం పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియా 75.56 శాతంతో టాప్ లో ఉండగా శ్రీలంక జట్టు 53.33 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఒకవేళ మిగతా టెస్టులలో గనుక గెలిస్తే భారత్ ర్యాంక్ మరింత మెరుగు పడే ఛాన్స్ ఉంది.
Also Read : భారత్ భళా ఆస్ట్రేలియా విలవిల