Xi Jin Ping Comment : జిన్ పింగ్ రియల్ కింగ్
మావో తర్వాత మరోసారి
Xi Jin Ping Comment : యావత్ ప్రపంచం మరోసారి చైనా వైపు చూస్తోంది. అనుమానాలు, అపోహలు, భ్రమలు, సంచనాలకు కేరాఫ్ గా మారింది చైనా. ఇవాళ మంచికైనా లేదా చెడు కైనా చైనా గురించి చర్చించకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది. నిన్నటి దాకా అమెరికా ఎదురే లేదని భ్రమపడింది.
కానీ ఎప్పుడైతే జిన్ పింగ్ డ్రాగన్ చైనా పగ్గాలు స్వీకరించాడో ఆనాటి నుంచి వణుకు మొదలైంది. పేరుకు జిన్ పింగ్(Xi Jin Ping) అయినా తాను చేతల్లో
చైనాను ప్రపంచ పటం మీద కింగ్ లాగా తీర్చి దిద్దడంలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల ఆయనను రెడ్ పీపుల్స్ ఆర్మీ (సైన్యం) బంధించిందని జోరుగా ప్రచారం జరిగింది.
ఆ వెంటనే అమెరికా స్పందించింది కూడా. కానీ ఎక్కడా చెక్కు చెదరలేదు జిన్ పింగ్. మళ్లీ చైనా వేదికపైకి వచ్చారు. తానేమిటో నిరూపించుకునే
ప్రయత్నం చేశారు. ఎక్కడా తల వంచడం అన్నది జిన్ పింగ్ చరిత్ర లో లేదు. ఎందుకంటే ముందు నుంచీ పోరాడటమే తనకు తెలిసిన విద్య అని ఓ సందర్భంలో పేర్కొన్నాడు .
ప్రపంచ మార్కెట్ ను చైనా శాసిస్తోంది. అమెరికా కాదన్నా ఇది వాస్తవం. ఇవాళ వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలు తన మీద, తను తయారు చేసే ఉత్పత్తులపై ఆధారపడేలా చేయడంలో కీలక పాత్ర పోషించేలా చేశాడు జిన్ పింగ్(Xi Jin Ping) .
అది ఆయనకు ఉన్న సత్తా. చైనా అంటేనే మావో గుర్తుకు వస్తాడు. రష్యా అంటే లెనిన్. క్యూబా అంటే ఫెడరల్ క్యాస్ట్రో, చావెజ్..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో నేతలు ఉన్నారు.
కానీ వీరందరి కంటే జిన్ పింగ్ భిన్నం. ఎక్కడా తొందరపాటు ఉండదు. ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే వార్ వన్ సైడ్ కావాల్సిందే. అందుకే జిన్ పింగ్ కు అంతటి జనాదరణ. అత్యంత శక్తివంతమైన నాయకుడిగా గుర్తించింది కమ్యూనిస్టు పార్టీ ఆమోదించింది.
ఇక మావో తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరొందిన ప్రచార సారథిగా పని చేసిన విప్లవకారుడైన ఝాన్ జింగ్ కు పుట్టాడు జిన్ పింగ్.
ఇదిలా ఉండగా జిన్ ను ప్రిన్సింగ్ అని పిలుచుకుంటారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇబ్బందిని కలిగించాయి జిన్ పింగ్ కు. అతడి
తండ్రి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత ఎలాగో కష్టపడి జిన్ పింగ్ ఇంజనీరింగ్ చదివాడు. ప్రపంచ సాహిత్యం అంటే వల్లమాలిన అభిమానం.
1998-2002 మధ్య మార్క్సిస్ట్ సిద్దాంతాన్ని అధ్యయనం చేశాడు. సింఘువా నుండి డాక్టరేట్ పొందాడు. 1983లో పార్టీ కార్యదర్శిగా పని చేశాడు.
1997లో చైనీస్ కమ్యూనిస్టు పార్టీ 15వ సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యాడు. కానీ తక్కువ ఓట్లు పొందాఉ. పుజియాన్ కి గవర్నర్ అయ్యాడు.
2002లో 16వ కేంద్ర కమిటీకి పూర్తి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2007లో పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా మారడంతో తన కెరీర్ పూర్తిగా మలుపు తిప్పిందనే చెప్పక తప్పదు. హు జింటావో తర్వాత చైనా నాయకుడిగా పేరొందాడు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి చేరుకున్నాడు.
2013లో జిన్ పింగ్ చైనాకు అధ్యక్షుడయ్యాడు. అంతే కాదు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ కూడా జిన్ పింగ్. మావో తర్వాత అత్యంత
శక్తివంతమైన నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు జిన్ పింగ్.
ఎన్నో ఆరోపణలు ఉన్నా ఆయనకు ఉన్న అపారమైన పాలనా దక్షత అతడిని కింగ్ ని చేసింది.
Also Read : ప్రత్యేక నాగాలాండ్ డిమాండ్ తప్పు కాదు