Yashasvi Jaiswal : సత్తా చాటిన పానీపూరి కుర్రాడు
రాజస్తాన్ విక్టరీలో కీలక పాత్ర
Yashasvi Jaiswal : ఐపీఎల్ 2022 కీలక రిచ్ టోర్నీలో చివరి బంతి దాకా ఉత్కంఠ రేగింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
10 ఫోర్లు 3 సిక్సర్లతో 57 బంతులు ఎదుర్కొని 93 రన్స్ చేశాడు. ధోనీ 26 చేసి రాణించాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ , మెక్ కామ్ చెరో వికెట్లు తీసి సత్తా చాటారు.
అనంతరం 151 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. 15వ సీజన్ లో సూపర్ ఫామ్ తో ఉన్న స్టార్ హిట్టర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ వెనుదిరిగాడు.
అనంతరం మైదానంలోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 15 పరుగులే చేసి అద్భుతమైన క్యాచ్ తో ఔట్ అయ్యాడు. ఇక ఓపెనర్ గా వచ్చిన పానీ పూరీ కుర్రాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
కళాత్మకమైన షాట్స్ తో హోరెత్తించాడు. ఎక్కడా తగ్గకుండా షాట్స్ కొట్టేందుకే ప్రయారిటీ ఇచ్చాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ కు అవసరమైన టార్గెట్ ను ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.
యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) 44 బంతులు మాత్రమే ఆడాడు. 8 ఫోర్లు ఒక భారీ సిక్సర్ తో 59 రన్స్ చేశాడు. ఇక కష్టాల్లో ఉన్న తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు వెటరన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.
23 బంతులు మాత్రమే ఎదుర్కొని 40 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇందులో 2 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : ప్లే ఆఫ్స్ పై వీడని ఉత్కంఠ