Yashasvi Jaiswal : ర‌ఫ్పాడించిన య‌శ‌స్వి జైస్వాల్

పంజాబ్ కు బిగ్ షాక్ ఇచ్చిన క్రికెట‌ర్

Yashasvi Jaiswal : ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో రాజ‌స్థాన్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

రాజ‌స్థాన్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఏకంగా పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 41 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 68 ప‌రుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

ఇత‌డి స్వ‌స్థ‌లం ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని భ‌దోహి సూర్య‌వ‌న్ . 28 డిసెంబ‌ర్ 2001లో పుట్టాడు. వ‌య‌సు 20 ఏళ్లు. ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్. 2020 నుంచి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో 2020 నుంచి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

దేశీయ క్రికెట్ లో లిస్ట్ ఏ త‌ర‌పున డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. ప్ర‌పంచంలోనే అతి పిన్న వ‌య‌స్సు క‌లిగిన క్రికెట‌ర్ గా పేరొందాడు. ఇక భార‌త జ‌ట్టు అండ‌ర్ -19 జ‌ట్టులో అత్య‌ధిక ప‌రుగుల స్కోర్ చేసిన క్రికెట‌ర్ గా నిలిచాడు.

2020 ఐపీఎల్ మెగా వేలంలో రాజ‌స్థాన్ 24 మిలియ‌న్ల‌కు చేజిక్కించుకుంది. ఆరుగురు సంతానంలో నాల్గో వాడు య‌శ‌స్వి జైస్వాల్. తండ్రికి చిన్న హార్డ్ వేర్ షాప్. ప‌దేళ్ల వ‌య‌సులో ఆజాద్ మైదాన్ లో శిక్ష‌ణ పొందేందుకు ముంబైకి వెళ్లాడు.

ఒక డేరాలో ఉంటూ ప్రాక్టీస్ చేశాడు. పానీ పూరీని అమ్ముతూ గ‌డిపాడు జైస్వాల్. అత‌డి ప్ర‌తిభ‌ను జ్వాలా సింగ్ గుర్తించాడు. ఆనాటి నుంచి నేటి దాకా వెన‌క్కి తిరిగి చూడ‌లేదు.

ఇదిలా ఉండ‌గా సీజ‌న్ ఆరంభానికి ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ య‌శ‌స్వి జైస్వాల్ ను రూ. 4 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్ ల‌లో రాణించ‌లేదు. నెల రోజుల త‌ర్వాత తిరిగి తీసుకుంది. ఈ ఛాన్స్ ను అద్భుతంగా వాడుకున్నాడు జైస్వాల్(Yashasvi Jaiswal).

 

Also Read : దీప‌క్ హూడా సూప‌ర్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!