ఐపీఎల్ 16వ సీజన్ లో జరిగిన కీలక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా 149 రన్స్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 150 రన్స్ చేసింది. యంగ్ స్టార్ యశస్వీ జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతులు ఆడి 15 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు . 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 29 బంతులు ఎదుర్కొని 47 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ గెలుపొందిన అనంతరం యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ మీడియాతో మాట్లాడాడు. తనకు సెంచరీ ముఖ్యం కాదని జట్టు విజయం అవసరమని స్పష్టం చేశాడు. తమ ముందున్న లక్ష్యం ఐపీఎల్ లో జట్టుకు రన్ రేట్ కావాల్సి ఉందని, తన ఫోకస్ అంతా దాని మీదే ఉందన్నాడు యశస్వి జైస్వాల్ . తన మనసులో తాను సెంచరీ చేయడం కంటే సక్సెస్ కావడం అత్యంత అవసరమని తాను భావిస్తున్నానని పేర్కొన్నాడు.
మిస్ అండర్ స్టాండింగ్ వల్ల జోస్ బట్లర్ ను కోల్పోవడం ఇబ్బందికరంగా మారిందన్నాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ తనను భుజం తట్టాడని, ఆ ఆలోచన రానీయకుండా నీదైన శైలిలో బ్యాటింగ్ చేయమని చెప్పాడని తెలిపాడు యశస్వి జైస్వాల్.
