Yashasvi Jaiswal : రెచ్చి పోయిన యశస్వి జైశ్వాల్
31 బంతులు 11 ఫోర్లు ఒక సిక్సర్
Yashasvi Jaiswal : యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అస్సాంలోని గౌహతి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న 11వ లీగ్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు జోస్ బట్లర్ , యశస్వి జైశ్వాల్ లు దంచి కొట్టారు. ప్రధానంగా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. 60 పరుగుల వద్ద ఉండగా పెవిలియన్ దారి పట్టాడు.
మొత్తం 31 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) 11 ఫోర్లు ఓ భారీ సిక్సర్ తో దుమ్ము రేపాడు. మరో వైపు జోస్ బట్లర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంలో కీలక పాత్ర పోషించాడు. యశస్వి అవుటయ్యాక మైదానంలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ నిరాశ పరిచాడు. సిక్స్ కొట్టేందుకని వెళ్లి డకౌట్ అయ్యాడు.
రియాన్ పరాగ్ కూడా మరోసారి ఫెయిల్ అయ్యాడు. 7 పరుగులు మాత్రమే చేసిన పరాగ్ పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన షిమ్రోన్ హిట్మెయర్ ఢిల్లీ బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక సత్తా చాటిన జైశ్వాల్ ను వన్డే జట్టుకు బీసీసీఐ ఎంపిక చేస్తుందా అని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read : చెలరేగిన జైశ్వాల్..బట్లర్..హిట్మెయర్