Yashasvi Jaiswal : చెలరేగిన యశస్వి జైస్వాల్
విండీస్ బౌలర్లకు చుక్కలు
Yashasvi Jaiswal : విండీస్ తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 5 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా వెస్టిండీర్, భారత జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలుపొంది చెరీ సమానంగా ఉన్నాయి. ఇదే మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లోనే సీరీస్ ఎవరిదో తేలనుంది.
Yashasvi Jaiswal Game
ఇక మ్యాచ్ విషయానికి వస్తే విండీస్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ వెంట వెంటనే వికెట్లు తీసినా , అర్ష్ దీప్ 3 వికెట్లతో చెలరేగినా విండీస్ మాత్రం గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసింది.
సిమ్రోన్ హిట్ మైర్ దంచి కొట్టాడు. 61 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 61 రన్స్ చేశాడు. షై హోప్ 3 ఫోర్లు 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ లో కీలక పాత్ర పోషించారు ఇద్దరూ.
179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా మూడు ఓవర్లు ఉండగానే భారత జట్టు గెలుపు సాధించింది. కేవలం ఒక వికెట్ కోల్పోయింది. 9 వికెట్ల తేడాగోద గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. భారత జట్టులో ఓపెనర్స్ అదుర్స్ అనిపించారు.
పానీ పూరీ కుర్రాడు యశస్వి జైస్వాల్(Yeshasvi Jaiswal) దుమ్ము రేపాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. జైస్వాల్ 51 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 3 సిక్సర్లతో దంచి కొట్టాడు. 84 రన్స్ చేశాడు. నాటౌట్ గా మిగిలాడు. గిల్ 47 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 5 సిక్సర్లతో 77 పరుగులతో ఆకట్టుకున్నాడు.
Also Read : IND vs WI 4th T20 : ఓపెనర్స్ అదుర్స్ భారత్ సూపర్
