Yasin Malik : యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు ఖరారు
ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు
Yasin Malik : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయ స్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది.
కాగా తీవ్రవాద నిధుల కేసులో కఠినమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద మోపిన అభియోగాలను యాసిన్ మాలిక్ గతంలో అంగీకరించాడు.
ప్రత్యేక కోర్టులో కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా ఎన్ఐఏ తరపు న్యాయవాది యాసిన్ మాలిక్(Yasin Malik) కు ఉరి శిక్ష వేయాలని కోరారు. దీంతో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఆందోళన నెలకొంది.
దీనిని పటాపంచలు చేస్తూ యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. 10 సంవత్సరాల కఠిన కారగారా శిక్ష విధించింది. రూ. 10 లక్షల జరిమానా కూడా కట్టాలని కోర్టు ఆదేశించిందని లాయర్ ఉమేష్ శర్మ తెలిపారు.
ప్రస్తుతం యాసిన్ మాలిక్ కు శిక్షపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే చాన్స్ ఉంది. విచారణ సందర్భంగా ఆసక్తికరమైన సంవాదం చోటు చేసుకుంది.
అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని భారత ప్రభుత్వం తనకు పాస్ పోర్టు ఎందుకు ఇస్తుందని అన్నారు యాసిన్ మాలిక్. తాను నేరస్తుడైతే ప్రపంచ వ్యాప్తంగా పర్యటించేందుకు , మాట్లాడేందుకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు.
1994 నుంచి తాను మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నానని చెప్పారు యాసిన్ మాలిక్(Yasin Malik). కాశ్మీర్ లో అహింసా రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.
గత 28 ఏళ్లలో ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు లేదా హింసకు పాల్పడినట్లు ఎత్తి చూపాలని సవాల్ విసిరారు. శ్రీనగర్ లో తీర్పు సందర్భంగా దుకాణాలు మూసి వేశారు. కొన్ని చోట్ల రాళ్లు రువ్వారు. నరిసన ప్రదర్శనలు చేపట్టారు.
Also Read : సీఎం నిర్ణయం పంజాబ్ భాషకు పట్టం