Yasin Malik : హింసోన్మాది ఎప్పటికీ గాంధీ కాలేరు
యాసిన్ మాలిక్ వ్యాఖ్యలపై కోర్టు
Yasin Malik : ఉగ్రవాదులకు నిధులు అందించారనే ఆరోపణలపై తప్పు ఒప్పుకోవడంతో కాశ్మీర్ వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మాలిక్ కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ధర్మాసనం జీవిత ఖైదు విధించింది.
ఈ సందర్భంగా ఎన్ఐఏ తరపు న్యాయవాది యాసిన్ మాలిక్ చేసిన విధ్వంసానికి ఎన్నో ఆధారలు ఉన్నాయి. ఇతడు జీవించి ఉండడం వల్ల సమాజంలో మరింత హింసకు కారణమవుతుంది.
అందుకని అతడిని ఎంత త్వరగా ఉరి తీస్తే అంత మంచిదని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు యాసిన్ మాలిక్(Yasin Malik) తరపున లాయర్. ఇదిలా ఉండగా వాదోపవాదాలు విన్న కోర్టు ముందు యాసిన్ మాలిక్ తన వాదనను వినిపించారు.
తాను నేరస్తుడినైతే అటల్ బిహారి వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఎందుకు పాస్ పోర్టు జారీ చేస్తుందని ప్రశ్నించారు. తాను గత 25 ఏళ్లుగా ఎలాంటి హింసకు పాల్పడలేదని, అలా పాల్పడినట్లు రుజువు చేస్తే తాను ఎలాంటి శిక్ష కైనా భరించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.
ఆపై తాను గాంధీ సూత్రాలను పాటిస్తానని, అహింసను కోరుకుంటున్నానని చెప్పారు. దీనిపై కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం తెలిపారు.
గాంధీ పేరు ఉచ్చరిస్తే, లేదా గాంధీ వాదాన్ని బలపరిస్తే చేసిన నేరాలు, పాల్పడిన కుట్రలు నిజం అయి పోవంటూ స్పష్టం చేశారు. హింసను ప్రేరేపించే, నమ్మే వ్యక్తి ఎప్పటికీ గాంధీ కాలేరన్నారు.
దోషి హింసను ప్రోత్సహిస్తూ , దూరంగా ఉండ లేదని పేర్కొంది. 1994 నుంచి తుపాకీని తాను వదులు కున్నానని యాసిన్ మాలిక్ చెప్పినా కోర్టు నమ్మలేదు.
94 కంటే ముందు యాసిన్ మాలిక్(Yasin Malik) తాను చేసిన తప్పులకు, హింసకు పశ్చాతాపం వ్యక్తం చేయక పోవడం దారుణం. ఒక ప్లాన్ ప్రకారం హింసకు పాల్పడ్డారంటూ కోర్టు స్పష్టం చేసింది.
Also Read : యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు ఖరారు