Yerra Sekhar : ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన వెనుకబడిన తరగతి వర్గాలకు చెందిన నాయకుడిగా పేరొందిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఎర్ర శేఖర్ కు కండువా కప్పుకున్నారు. ఆయన సోదరుడు ఎర్ర సత్యంకు బలమైన బలగం ఉంది.
తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పేరొందారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన సోదరుడు ఎర్రశేఖర్(Yerra Sekhar) ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
టీడీపీ పార్టీపై మూడు సార్లు శాసన సభ్యుడిగా గెలుపొందారు. అనుకోని పరిస్థితుల్లో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అక్కడ కొందరి నేతలతో పొసగక పోవడంతో రాజీనామా ప్రకటించారు.
తమ్ముడి హత్య కేసుకు సంబంధించిన కేసులో నిర్దోషిగా బయట పడ్డాడు. దీంతో ఎర్రశేఖర్ కు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం ఏర్పడింది.
ఇవాళ ఆయన కాంగ్రెస్ కండువా కప్పు కోవడంతో బలమైన సామాజిక వర్గంగా పేరొందిన ముదిరాజ్ ఓటు బ్యాంక్ పార్టీకి ప్లస్ కానుందని రాజకీయ వర్గాల అంచనా.
ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎర్ర శేఖర్(Yerra Sekhar) మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేతిలో ఓటమి చెందారు. దీంతో జడ్చర్ల నియోజకవర్గంలో శేఖర్ అభిమానులు సంబురాలలో మునిగి పోయారు.
Also Read : ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి