Yerrasekhar : కాంగ్రెస్ పై ఎర్ర‌శేఖ‌ర్ గుస్సా

నేడు పార్టీ కార్య‌క‌ర్త‌లతో మీటింగ్

Yerrasekhar : ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో కీల‌క‌మైన సామాజిక వ‌ర్గానికి, బీసీ నేత‌గా ఉన్న జ‌డ్చ‌ర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర‌శేఖ‌ర్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ముదిరాజ్ కులానికి చెందిన ఎర్ర‌శేఖ‌ర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ‌తంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Yerrasekhar Comments Viral

త‌న అన్న ఎర్ర స‌త్యం దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఆ వెంట‌నే ఎర్ర‌శేఖ‌ర్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. ఆ వెంట‌నే భార‌తీయ జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. ఉన్న‌ట్టుండి దానికి రాజీనామా స‌మ‌ర్పించారు.

ఆ వెంట‌నే రేవంత్ రెడ్డి స‌హ‌చ‌రుడు కావ‌డంతో ఆయ‌న‌ను న‌మ్ముకుని కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. జ‌డ్చ‌ర్ల టికెట్ ను ఆశించారు. అక్క‌డ అనిరుధ్ రెడ్డికి టికెట్ వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

చివ‌రి వ‌ర‌కు త‌న‌కు నారాయ‌ణ‌పేట టికెట్ వ‌స్తుంద‌ని ఆశించారు ఎర్ర‌శేఖ‌ర్(Yerrasekhar). కానీ అక్క‌డ డీకే అరుణ త‌మ్ముడు వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి కూతురు ప‌ర్ణికా రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎర్ర‌శేఖ‌ర్. ఇవాళ త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Amit Shah : నిరాశ ప‌ర్చిన అమిత్ షా

Leave A Reply

Your Email Id will not be published!