Yogi Adityanath : సనాతన ధర్మాన్ని మంట కలిపే కుట్ర చేస్తున్నారంటూ మమతపై యోగి కీలక వ్యాఖ్యలు

సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నేతలు దాడులు చేస్తోందని ఆరోపించారు....

Yogi Adityanath: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నేతలు దాడులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రామనవమి వేడుకలతో పాటు ఊరేగింపులు సజావుగా జరిగాయన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ లో మాత్రం దాడులు జరిగాయని, ఇది సనాతన ధర్మాన్ని దెబ్బ తీసే కుట్ర అని ఆక్షేపించారు. ప్రధాని మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలోని బీజేపీ దేశంలో భద్రతను మెరుగుపరిచిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

Yogi Adityanath Slams

ప్రధాని మోదీ జాతీయవాదం, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన కారణంగా రాజస్థాన్‌ లో బీజేపీకి గణనీయమైన మెజారిటీ దక్కిందని సీఎం యోగి పేర్కొన్నారు. గత ఎన్నికల మాదిరిగానే రాజస్థాన్ లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 25 సీట్లు దక్కాయని, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వందశాతం సీట్లు సాధిస్తుందని ఉత్తరప్రదేశ్ సీఎం స్పష్టం చేశారు.

కాగా.. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ముందస్తు ప్రణాళికతోనే ఊరేగింపుపై దాడి జరిగిందని మమతా బెనర్జీ అన్నారు. ఘటనకు పాల్పడేందుకు వీలుగా రామనవమికి ఒక రోజు ముందు ముర్షిదాబాద్ డీఐజీని తొలగించారని విమర్శించారు.

Also Read : CJI Chandrachud : ఓటర్లు ఆ పని చేయొద్దంటూ సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!