IND U19 World Cup : యువ భారత జట్టు అరుదైన చరిత్ర సృష్టించేందుకు సన్నద్దం అవుతోంది. ప్రస్తుతం వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ -19 వరల్డ్ కప్ లో సత్తా చాటింది అండర్ -19 భారత జట్టు.
టోర్నీ మొదట్లో టీమిండియా ఆటగాళ్లు కొందరు కరోనా బారిన పడినప్పటికీ ఆశించిన దాని కంటే అద్భుతంగా రాణించారు.
తమ అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించారు. ఇక ఆఖరి అంకానికి సమయం ఆసన్నమైంది.
ఈనెల 5న అండర్ -19 ఇంగ్లండ్ జట్టుతో(IND U19 World Cup) ఫైనల్ లో తలపడనుంది భారత జట్టు.
ఇప్పటికే కెప్టెన్ యష్ ధుల్ ఫుల్ ఫామ్ లో ఉండడంతో పాటు అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ పటిష్టంగా ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరుకోవడం భారత జట్టు ఇది నాలుగో సారి.
లీగ్ లో భాగంగా ఫస్ట్ సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టు ఆఫ్గనిస్తాన్ జట్టుపై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది.
24 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి చేరుకోవడం ఆ జట్టు. ఇక భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా టీంను మట్టి కరిపించింది.
ఏకంగా 94 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించి నేరుగా ఫైనల్ కు చేరింది.
ఈ మ్యాచ్ లో కెప్టెన్ యశ్ ధుల్ 10 ఫోర్టు ఓ భారీ సిక్స్ తో 110 పరుగులు చేసి సత్తా చాటాడు.
ఇక షేక్ రషీద్ 94 పరుగులు చేసి దుమ్ము రేపాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఇక భారత్ అండర్ 19 జట్టు నాలుగు సార్లు వరల్డ్ కప్ గెలుచుకుంది. 2000లో కైఫ్ , 2008లో విరాట్ కోహ్లీ, 2012లో ఉన్మక్ చంద్ , 2018 పృథ్వీ షా సారథ్యంలో జట్టు ఛాంపియన గా నిలిచింది. మూడు సార్లు 2006, 2016, 2020లో రన్నర్ అప్ గా నిలిచింది.
Also Read : వెంటాడుతున్న కరోనా మ్యాచ్ జరిగేనా