Mohammad Azaharuddin : భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ మహమ్మద్ అజహరుద్దీన్(Mohammad Azaharuddin) ఆసిస్ క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ అకాల మరణంపై స్పందించాడు.
ఇది ఊహించని వార్త. ఇంత చిన్న వయసులో వెళ్లి పోతాడని అనుకోలేదు. ఆట పరంగా ఎన్నో మ్యాచ్ లు ఇద్దరం ఆడాం. తాము ఆడుతున్న కాలంలో షేన్ వార్న్ అంటే చాలా మంది ఆటగాళ్లు ఇబ్బంది పడే వారు.
అద్భుతమైన లెగ్ స్పిన్నర్ గా పేరున్న షేన్ వార్న్ బౌలింగ్ లో తాను సిక్స్ లు కొట్టిన జ్ఞాపకం ఇంకా కదులుతూనే ఉంది. క్రికెటర్ గా , కామెంటేటర్ గా తనదైన ముద్ర వేసిన షేన్ వార్న్ లేడన్న వార్తను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నా.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నా. తాను ఆ వార్తను విని షాక్ కు గురయ్యా. చాలా సేపు మాటలు రాలేదు. చాలా జోవియల్ గా ఉండేవాడు.
మైదానంలోనే కాదు బయట కూడా అంతే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కబుర్లు చెబుతూ వచ్చిన షేన్ వార్న్ ఇప్పుడు లేడని తలుచుకుంటేనే బాధగా ఉందన్నాడు మహమ్మద్ అజహరుద్దీన్(Mohammad Azaharuddin).
ప్రపంచ క్రికెట్ లో అరుదైన ఆటగాడిగా తాను అభివర్ణిస్తానని ఎందుకంటే అతడి బంతిలో ఏదో మాయాజాలం ఉంది. నేను మణికట్టుతో పరుగులు తీస్తే షేన్ వార్న్ సైతం అదే మణికట్టుతో మంత్రజాలం చేస్తూ వచ్చాడు.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో దిగ్గజం లేక పోవడం విషాదకరంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదని వాపోయాడు మహమ్మద్ అజహరుద్దీన్. మిత్రమా నీ మరణం నన్ను మళ్లీ మళ్లీ జ్ఞాపకం వచ్చేలా చేస్తోందని పేర్కొన్నాడు.
Also Read : పాకిస్తాన్ జోరు ఆస్ట్రేలియా బేజారు