YS Jagan Comment : అధికారం వేరు పాలిటిక్స్ వేరు. నువ్వు నేర్పిన పాఠమే నీకు తిరిగి అప్పజెప్పితే ఎలా ఉంటుంది. ఈ ఒక్క మాట ఏపీలో జగన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో తనకు బాగా తెలుసు. ఎక్కువగా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడరు. యాక్షన్ కే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. తనకు వయసు చాలా తక్కువ. కానీ రాజకీయంగా అనుభవం ఎక్కువ. ఇదే ఇప్పుడు అతడిని రాటుదేలేలా చేసింది. ఓ వైపు కేంద్రం మరో వైపు ప్రతిపక్షాలు. కానీ ఎక్కడా అడుగు వెనక్కి వేయలేదు. నిత్యం వేటాడితే పులికి విలువ ఏముంటుంది. అవసరమైనప్పుడు మాత్రం, అదును చూసి దెబ్బ కొడితేనే దానికి పవర్ ఉన్నట్టు లెక్క. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. తనను టార్గెట్ చేస్తూ , వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చినా ఎక్కడా తగ్గలేదు.
YS Jagan Comment Viral
45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు అంతటి వాడే కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. తన భార్యను అనరాని మాటలు అన్నారంటూ వాపోయాడు. ఇదంతా జాతీయ మీడియాలో వచ్చింది. ప్రచారం జరిగింది కానీ సానుభూతి మాత్రం ఎక్కువగా రాలేదు. జగన్(YS Jagan) ఒక అడుగు ముందుకు వేస్తే వేయి అడుగుల తర్వాత ఏం జరుగుతుందోనని ఆలోచించి చేస్తాడు. తనను సైకో అన్నా , నేరస్థుడిగా చిత్రీకరించినా భరించాడు. కానీ ఉన్నట్టుండి చంద్రబాబుకు చుక్కలు చూపించాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం తనకు మాత్రమే తెలుసు అని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు చిరుతగా తనను తాను భావించే టీడీపీ చీఫ్ కు అంతిమ జీవితంలో గుర్తు పెట్టుకునేలా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లేలా చేశాడు. పైకి ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకున్నా వెనుక ఉండి నడిపించింది అంతా జగన్ రెడ్డి(YS Jagan) అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
చంద్రబాబుతో పాటు తనయుడు లోకేష్ , పవన్ కళ్యాణ్ ఏకమై తనను అనరాని మాటలు అన్నా భరించాడు. ఆపై ఓ తేలికపాటి నవ్వు విసిరాడు. నిన్నటి దాకా తనకు ఎదురే లేదని భావిస్తూ వచ్చిన టీడీపీ చీఫ్ కు ఎదురు తిరిగి అనేందుకు వీలులేకుండా చేశాడు. ప్రస్తుతం డిఫెన్స్ లో పడేలా చేయడంలో జగన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఇంకా ఎన్నికలు జరిగేందుకు కొంత సమయం ఉంది. అంత లోపు పార్టీని , వ్యవస్థల్నీ, శ్రేణుల్ని మరింత అప్రమత్తం చేస్తాడు. ఆపై ప్రత్యర్థులు కోలుకునే లోపే అందనంత దూరంలో ఉంటాడు జగన్. ఇదే ఏపీ సీఎం ప్లాన్. నిత్యం వ్యక్తిగత విమర్శలతో కాలం వెళ్లదీస్తే జనం ఆదరించరన్న వాస్తవాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తించక పోవడం విడ్డూరంగా ఉంది. ఏది ఏమైనా మచ్చ లేదంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబును , తన పరివారాన్ని, ఆయనకు మద్దతు ఇస్తున్న వారిని చక్రబంధంలో జగన్ బిగించాడన్నది బహిరంగ రహస్యం.
Also Read : Gone Prakash Rao : రేవంత్ నిర్వాకం కాంగ్రెస్ ఖతం