YS Jagan : మ‌హిళా సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన సీఎం జ‌గ‌న్ రెడ్డి

YS Jagan : మ‌హిళా సంక్షేమం త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan). దేశంలో ఎక్క‌డా లేని విధంగా తాము సంక్షేమ ప‌థ‌కాలు , కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

70 శాతం మంత్రి ప‌ద‌వులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు ఇచ్చామ‌న్నారు సీఎం. 5 ఉప ముఖ్య‌మంత్రులుంటే మ‌ళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీల‌నే కొన‌సాగించామ‌ని తెలిపారు.

ఏపీ రాష్ట్ర చ‌రిత్ర‌లో సామాజిక న్యాయం పాటించిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఎక్క‌డ కూడా పాటించ లేద‌న్నారు. కొంద‌రు త‌మ మాటల్లో ప‌దే ప‌దే చెబుతూ ఉంటారు.

కానీ తాము ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించామ‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan). అంత‌కు ముందు స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లోని మ‌హిళ‌లు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వ‌డ్డీని వ‌రుస‌గా మూడో సంవ‌త్స‌రం సున్నా వ‌డ్డీ ప‌థ‌కం కింద ఎంపికైన ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ చేశారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ఈ 35 నెల‌ల కాలంలో 1,36, 694 కోట్లు ప్ర‌జ‌ల‌కు అంద‌జేశామ‌న్నారు. ఇది ఒక చ‌రిత్ర‌గా సీఎం అభివ‌ర్ణించారు.

కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కానీ వాళ్ల‌కు తెలియ‌దు ప్ర‌జ‌లు త‌మ వైపు ఉన్నార‌నే విష‌యం అన్నారు. చంద్ర‌బాబు నాయుడు త‌లా తోకా లేకుండా మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

ఆయ‌న ఏది లేక పోయినా ఉండ‌గ‌ల‌రు కానీ ప‌ద‌వి లేకుండా , కుర్చీ లేకుండా ఉండ‌లేరన్నారు. వాస్త‌వాలు తెలుసు కోకుండా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఇప్ప‌టికే టీడీపీని ప్ర‌జ‌లు ఛీ కొట్టార‌ని ఆ విష‌యం స్వ‌త‌హాగా తెలుస‌న్నారు. కానీ బాబు ఇంకా మార‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : బుద్దా సూసైడ్ బ్యాచ్‌పై పోలీసు కేసు

Leave A Reply

Your Email Id will not be published!