YS Jagan : దోచుకో, పంచుకో, తినుకో అనేదే సీఎం చంద్రబాబు అజెండా – వైఎస్ జగన్
చంద్రబాబు సర్కార్‌లో కప్పం కట్టనిదే ఏ పనీ జరగదని జగన్ అన్నారు...
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నూతనంగా ఏపీలో మద్యం, ఇసుక విధానాలు తీసుకువచ్చారని, వాటిలో అంతా అవినీతేనని జగన్ ఆరోపించారు. దోచుకో, పంచుకో, తినుకో అనేదే సీఎం చంద్రబాబు పాలనని మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ మీడియా సమావేశం నిర్వహించి ఏపీలోని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు.
YS Jagan Comment
చంద్రబాబు సర్కార్‌లో కప్పం కట్టనిదే ఏ పనీ జరగదని జగన్ అన్నారు. అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల ఆశలతో ఆయన చలగాటం ఆడారని జగన్ అన్నారు. ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అని ఊదరకొట్టారని, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా సూపర్ సిక్సూ లేదు, సూపర్ సెవెనూ లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే స్వరాలు వినపడకుండా చేయాలని సీఎం చూస్తున్నారని, ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.
Also Read : Kodikatti Srinu : ఈరోజు కోడి కత్తి కేసు విచారణకు డుమ్మా కొట్టిన మాజీ సీఎం