YS Sharmila: YSR అనే అక్షరాలకు షర్మిల కొత్త భాష్యం !

YSR అనే అక్షరాలకు షర్మిల కొత్త భాష్యం !

YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల… తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలోని YSR అనే అక్షరాలకు కొత్త భాష్యం చెప్పారు. వైసీపీ నాయకులు చెప్తున్నట్లు YSRCPలో YSR అంటే యువజన శ్రామిక రైతు లేదా యెదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి కాదని…. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి అని ఆమె ఎద్దేవా చేసారు. ఇసుక, మట్టి, గనులు వంటి సహజ వనరుల దోపిడీ తప్ప అభివృద్ధి చేయడం వారికి తెలియదని మండిపడ్డారు. ఒంగోలు జిల్లా పర్యటలో భాగంగా గుండల్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన వైఎస్ షర్మిల అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధానికి నేను రెడీ ! మీరు రెడీనా ? అంటూ వైసీపీ నాయకులకు షర్మిల(YS Sharmila) సవాల్‌ విసిరారు. ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.

YS Sharmila Comment

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… ‘‘ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతుంటే… వైసీపీ వారంతా నాపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద వైఎస్‌ఆర్‌ నిర్మిస్తే… జగన్‌ సర్కారు దానిని నిర్వహణ కూడా చేయలేకపోతోంది. వైఎస్‌ వారసులమని చెప్పేవారు ‘గుండ్లకమ్మ’ను ఎందుకు పట్టించుకోవడం లేదు. గేట్లు ఊడిపోయినా పట్టించుకోని వారా ఆయన ఆశయాలు నిలబెట్టేది ? వైఎస్‌ హయాంలో 70 శాతం పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. జగన్‌ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా ? రాష్ట్రంలో నీటిపారుదల శాఖా మంత్రికి సంక్రాంతి డ్యాన్సులు వేయడం తప్ప… ప్రాజెక్టుల గురించి తెలియదని మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లు వేసారు.

ఏపీపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల(YS Sharmila) పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రోజు రోజుకు అధికార వైసీపీ, వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైఎస్ఆర్ వారసుడిగా ముఖ్యమంత్రి అయిన తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి… తన తండ్రి ఆశయాలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని బీజేపీకు తాకట్టుపెట్టాని షర్మిల ఆరోపించగా… కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చిందంటూ సాక్ష్యాత్తూ సీఎం జగన్ ఆరోపించారు. మరోవైపు అసలు షర్మిలకు వైఎస్ ఇంటిపేరు పెట్టుకునే అర్హత లేదని… స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర చేసిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం ఒంగోలు జిల్లా పర్యటనలో షర్మిల మరింత ఘాటుగా స్పందిచారు.

Also Read : Bihar CM : తన సీఎం పదవికి రాజీనామా చేసిన బీహార్ సీఎం నితీష్

Leave A Reply

Your Email Id will not be published!