YS Sharmila : నా మీద విమర్శలు కాదు..దమ్ముంటే నా ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టుల మెగా డీఎస్సీని రూపొందించినప్పుడు

YS Sharmila : తనపై వ్యక్తిగత విమర్శలు కాదు.. తాను అడిగిన తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నాయకత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సవాల్ చేసారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టుల మెగా డీఎస్సీని రూపొందించినప్పుడు.. ఆయన వారసుడిగా చెప్పుకునే జగన్ అన్న కేవలం 6 వేల పోస్టులతో మెగా డిఎస్సి ని దగా డిఎస్సి గా సృష్టించారని విమర్శించారు. . దీనిపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని,ఆ వైసీపీ నేతలకు, వారికి మద్దతిచ్చే వారికి వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో 9 ప్రశ్నలు సంధించారు.

YS Sharmila Slams

1. 2019 ఎన్నికలలో వాగ్దానం చేసిన ఆమె 25,000 ఉపాధ్యాయ స్థానాలను ఎక్కడ భర్తీ చేసారు?

2. నోటీసు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేసారు?

3. ఎన్నికలకు నెలన్నర ముందు 6,000 స్థానాలు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి?

4. TET, DSC రెండు నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి?

5 ప్రకటించిన 30 రోజులలోపు పరీక్షను నిర్వహించడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్‌కు 20 రోజులు, డీఎస్సీకి 6 రోజులు టైమా…?

6. వైఎస్ఆర్ హయాంలో 100 రోజులు గడువు ఇచ్చిన సంగతి జగన్ వారసులకు గుర్తులేదా?

7. నిర్దేశించిన సిలబస్ ప్రకారం, ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా 150 పుస్తకాలను చదవాలని మీకు తెలుసా?

8. పరీక్ష రాసే వ్యక్తి ఒక రోజులో ఐదు పుస్తకాలు చదవడం సాధ్యమేనా?

9. నిరుద్యోగులను మానసిక ఒత్తిడికి గురిచేసే కుట్ర జరుగుతోందా? ఇది కక్ష్య సాధింపు కాదా?

ఈ తొమ్మిది ప్రశ్నలకు తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ సమాధానం చెప్పాలని దేశానికే కొత్త పట్టం కట్టే జగన్ అన్నను షర్మిల కోరారు.

Also Read : Delhi News : ఢిల్లీలో గందరగోళం…రైతులపై టియర్ గ్యాస్ హల్చల్

Leave A Reply

Your Email Id will not be published!