YS Sharmila Peddi Comment : ‘మగతనం’ రాజకీయం కలకలం
తెలంగాణ హీటెక్కిన పాలిటిక్స్
YS Sharmila Peddi Comment : తెలంగాణలో ఏం జరుగుతోంది. ఎందుకింతగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఓ వైపు లిక్కర్ స్కాం ..ఇంకో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులతో అట్టుడుకుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి.
నోటీసులు ఇస్తున్నాయి. ఆపై సోదాలు..కేసులు..అరెస్ట్ లకు దిగుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ ప్రకటించారు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.
ఆమె తన తండ్రి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఆపై షర్మిల ఎవరు విడిచిన బాణం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
పార్టీ ప్రారంభించిన(YS Sharmila Peddi) సమయంలో ఆమె టీఆర్ఎస్ విడిచిన బాణం అని అన్నారు. ఆ తర్వాత బీజేపీ విడిచిన బాణం అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో తాను ఎవరి బాణం కానని ప్రజల తరపున బాణం అంటూ స్పష్టంగా ప్రకటించారు.
ఎవరూ ఊహించని రీతిలో ఆమె తన స్టాండ్ ఏమిటో చెప్పారు. ఆపై మెల మెల్లగా దూకుడు పెంచారు. ఆపై మాటల తూటాలు పేల్చుతూ వచ్చారు. ప్రధానంగా ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టారు.
అంతే కాదు ప్రతి రోజూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలదీస్తున్నారు. ఆపై ఊరుకోకుండా ఏకంగా కల్వకుంట్ల కుటుంబం ఎలా దోచుకుంటున్నదనే దానిపై నిలదీస్తూ అడుగుతున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ మరింత హాట్ టాపిక్ గా మారారు. ఇదే క్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి తనను మరదలు అని సంబంధించడంపై తీవ్రంగా స్పందించారు.
ఆపై ఆయనను చెప్పుతో కొడతానంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమెపై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఎండనక వాననక నడుస్తూ వెళ్లారు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల భాగోతాలను ఎండగడుతూ వచ్చారు.
ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏకంగా 70 వేల కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. ఆపై కేసీఆర్ నివసిస్తున్న ప్రగతి భవన్ పై రైడ్స్ చేయాలని కోరారు.
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారారంటూ మండిపడుతున్నారు. ఇదే సమయంలో వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఆయనకు మగతనం ఉంటే..అని సంబోధించారు. ఆమె చేసిన కామెంట్స్ పై టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. షర్మిలకు చెందిన కారు, బస్సును ధ్వంసం చేశారు.
ఆపై ధ్వంసం చేసిన వాటితోనే ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు బయలు దేరింది. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం, బెయిల్ దొరకడం, కోర్టు తిరిగి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వడం జరిగి పోయింది.
ఇక షర్మిల మాటల తీవ్రతను పెంచుతూ వెళ్లారు. తెలంగాణ ఆఫ్గనిస్తాన్ గా మారిందని, నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తాలిబన్లుగా మారారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆపై ఖాకీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో టీఆర్ఎస్ కు గులాంలుగా మారారంటూ నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా గవర్నర్ ను కలిసిన తర్వాత షర్మిల మరోసారి మగతనం గురించి ప్రస్తావించారు. పెద్ది మగతనం గురించి నాకేంటి సంబంధం ఆయన భార్యను అడగాలి అని ఎద్దేవా చేశారు.
ఆపై జగ్గారెడ్డిపై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు. రాజకీయం ఎవరైనా చేయవచ్చు. కానీ పార్టీలు అన్నాక నేతలు కొంత సంయమనం పాటించాలి. లేక పోతే వాటికి విలువ ఉండదు.
తెలంగాణ సమాజం ఎప్పుడూ ఇలాంటి మాటల్ని, సంస్కృతిని కోరుకోదు. ఆరోగ్య కరమైన రాజకీయాలు కావాల్సిన అవసరం ఉంది.
Also Read : తాలిబాన్ల రాజ్యం ఖాకీలు దారుణం – షర్మిల