YS Sharmila KCR : దొర చెప్పేది బారాణా చేసేది చారాణా
సీఎం కేసీఆర్ పై షర్మిల కామెంట్స్
YS Sharmila KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె శుక్రవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. మరోసారి కేసీఆర్ పై భగ్గుమన్నారు. ఎన్నికల వేళ మళ్లీ హామీల వర్షం కురిపిస్తున్నారని ఆరోపించారు. జిమ్మిక్కులు చేస్తూ మోసం చేసేందుకు సిద్దమయ్యాడని మండిపడ్డారు. ఇండ్లకు పైసలు ఇస్తానని అంటుండు. పోడు పట్టాలు ఇస్తానని నమ్మ బలుకుతుండు. బీసీలను ఆదుకుంటానని గొప్పలు పోతున్నడని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల.
సీఎం కేసీఆర్ చెప్పేది బారాణా చేసేది చారాణా మందం అంటూ ఎద్దేవా చేశారు. 13 లక్షల ఖర్చు అయ్యే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కనీసం రూ. 30 వేలు కూడా ఇవ్వడం చేత కాలేదని ఇన్ని హామీలు ఎలా నేరవేరుస్తాడని ప్రశ్నించారు. గతంలో 15 లక్షలు ఇస్తానని చెప్పిన దొర ఆ మాట మరిచి పోయిండని మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఎన్నికల్లో గెలిస్తే లక్ష ఇస్తానంటూ మాయ చేసేందుకు రెడీ అవుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండ్ల పేరుతో 30 లక్షల కుటుంబాలను మోసం చేసే పనిలో కేసీఆర్ పడ్డాడంటూ ఫైర్ అయ్యార్ వైఎస్ షర్మిల. గెలిచిన 9 ఏళ్లలో ఒక్క ఎకరాకు పోడు పట్టా ఇవ్వలేదన్నారు. బీసీలను నిండా ముంచిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని బీసీ జపం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.
Also Read : HD Kumara Swamy