YS Sharmila KCR : దొర పాల‌న‌లో రైతన్న‌లు ద‌గా

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిల

YS Sharmila KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రైతుల‌ను నిండా ముంచిన చ‌రిత్ర సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. రైతు దినోత్స‌వం కాద‌ని రైతు ద‌గా దినోత్స‌వం అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రుణ‌మాఫీ , పంట ప‌రిహారంపై బందిపోట్ల‌ను నిల‌దీస్తుంటే కేసీఆర్ కు సిగ్గు కూడా కూడా అనిపించ‌డం లేదంటూ ఎద్దేవా చేశారు. అస‌లు సీఎం ఏం సాధించార‌ని రైతు దినోత్స‌వాలు జ‌రుపుతున్నారంటూ ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిల‌.

ల‌క్ష లోపు రుణ మాఫీ అని చెప్పి 31 ల‌క్ష‌ల మంది రైతుల‌ను మోసం చేసినందుకా ఏటా 26 ల‌క్షల ట‌న్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామ‌ని ద‌గా చేసినందుకా అని నిల‌దీశారు. తొమ్మిదేండ్ల‌లో 9 వేల మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్నార‌ని ఆరోపించారు. పంట న‌ష్ట ప‌రిహారానికి దిక్కు లేద‌న్నారు. పంట భీమాకు మోక్షం లేద‌న్నారు. ఎక‌రాకు ముష్టి రూ. 5 వేలు రైతు బంధు ఇచ్చి ఇన్ పుట్ స‌బ్సిడీ , రాయితీ ఎరువులు , విత్త‌నాలు , యంత్ర ల‌క్ష్మి వంటి రూ. 30 వేల రైతు ప‌థ‌కాల‌ను బొంద పెట్టిండ‌ని మండిప‌డ్డారు.

ప్ర‌తి ఎక‌రాకు నీళ్లు ఇస్తాన‌ని చెప్పి, కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో రూ. 1.21 ల‌క్ష‌ల కోట్ల అప్పు తెచ్చి క‌మీష‌న్లు దోచుకున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ ష‌ర్మిల‌. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రైతుల ఉసురు త‌గల‌క త‌ప్ప‌ద‌న్నారు. రైతుల‌కు మాయ మాట‌లు చెప్పి వెన్నుపోటు పొడిచిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ పాల‌న తాలిబ‌న్ పాల‌న‌ను గుర్తుకు తెస్తోంద‌న్నారు.

Also Read : Bandi Sanjay : కేసీఆర్ హామీలు నీటి మూట‌లు – బండి

 

Leave A Reply

Your Email Id will not be published!