YS Sharmila Paper Leak : పేప‌ర్ లీక్ లో ఇద్ద‌రే నిందితులా

సిట్ రిపోర్టుపై వైఎస్ ష‌ర్మిల కామెంట్స్

YS Sharmila Paper Leak : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila Paper Leak) షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర స‌ర్కార్ నియ‌మించిన సిట్ చివ‌ర‌కు లీకుల వ్య‌వ‌హారానికి సంబంధించి ఇద్ద‌రే నిందితులని పేర్కొన‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని పేర్కొంది. 15 పేప‌ర్లు లీక్ అయితే , 6 పరీక్ష‌లు ర‌ద్దు అయ్యాయ‌ని మిగ‌తా వాటిని ఎందుకు ర‌ద్దు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిల‌.

స‌ర్కార్ అల‌స‌త్వం, టీఎస్పీఎస్సీ నిర్వాకం కార‌ణంగా తెలంగాణ‌కు చెందిన 10 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు రోడ్డున ప‌డ్డార‌ని , వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో డ్ర‌గ్స్ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కూడా నీరు గార్చార‌ని ప్ర‌స్తుతం అదే విధంగా టీఎస్పీఎస్సీ కేసు కూడా త‌యారైంద‌ని ఆరోపించారు.

సిట్ పై ఆమె నిప్పులు చెరిగారు. ఈ కేసును నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. స‌ర్వ‌ర్ నుంచి పేప‌ర్స్ లీక్ అయ్యాయంటే దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హించాల‌ని ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). మీరు నిర్దోషులైతే ద‌ర్యాప్తును సీబీఐకి ఎందుకు ఇవ్వ‌డం లేదంటూ నిల‌దీశారు. ఈనెల 17న ఇందిరా పార్క్ వ‌ద్ద నిరాహార దీక్ష చేప‌డుతున్నామ‌ని ప్ర‌తి ఒక్క‌రు హాజ‌రు కావాల‌ని కోరారు.

Also Read : ఒకే రోజు ప‌రీక్ష‌ల‌పై ఆర్ఎస్పీ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!