YSRCP : వైసీపీకి ఝలక్ ఇవ్వనున్న మరో మాజీ మంత్రి

వైఎస్ జగన్‌కు నమ్మిన బంటుగా ఉంటూ....

YSRCP : ఎన్నికల్లో ఓటమి పాలై.. అధికారానికి వైఎస్ఆర్‌సీపీ(YSRCP) దూరమైంది. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలు ఇప్పటికే ఆ పార్టీని వీడారు. మరికొంత మంది అయితే పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎంతో నమ్మకంతో అప్పగించిన కీలక పదవులకు సైతం రాజీనామా చేసి.. పార్టీని వదిలి వెళ్లి పోయారు. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. వరుసగా బిగ్ షాక్‌లే తగులుతున్నాయి. ఆ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తాజాగా మరో బిగ్ షాక్ తగలనుందంటూ ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

YSRCP Leaders..

వైఎస్ జగన్‌కు నమ్మిన బంటుగా ఉంటూ.. ఆయన విశ్వాస పాత్రుడిగా మెలిగిన ఓ మాజీ మంత్రి పార్టీ వీడేందుకు తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ… తన సన్నిహితులతో చర్చిస్తున్నారనే ఓ ప్రచారం అయితే సదరు సర్కిల్‌లో సాగుతుంది. ఆ ముఖ్య నేత ఎవరో కాదు. మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) అని సమాచారం. తెలుగుదేశం లేదా జనసేనలోకి జంప్ కొట్టేందుకు జోగి రమేశ్ మంతనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా పోలిటికల్ సర్కిల్‌లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తుంది.

అయితే జగన్ పార్టీలో నోరున్న నేతల్లో జోగి రమేశ్(Jogi Ramesh) పేరు అగ్రస్థానంలో ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పార్టీ అధినేత, నాటి సీఎం వైఎస్ జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం జోగి రమేశ్ ఎంత చేయాల్లో అంత చేశారనే ఓ చర్చ సైతం నేటికి పోలిటికల్ సర్కిల్‌లో ఉంది. అంటే.. నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి తెగబడడంతోపాటు వివిధ సందర్భాల్లో పలు వేదికలపై నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం వరకు ఎంత చేయాల్లో అంతా జోగి రమేశ్(Jogi Ramesh) చేశారంటూ ఓ చర్చ అయితే వాడి వేడిగా నేటికి సాగుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో జోగి రమేశ్ పార్టీలోకి వస్తానంటే.. ఈ రెండు పార్టీల కేడర్ ఒప్పుకుంటుందా? అనే ఓ సందేహం సైతం సదరు సర్కిల్‌లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది.

రామాయణంలో రాముడి అడుగులో లక్ష్మణుడు ఎలా అడుగు వేశాడో.. అలాగే వైఎస్ జగన్‌కు నేను అంటూ జోగి రమేశ్ పలు వేదికల మీద నుంచి బహిరంగంగానే ప్రకటించారు. మరి అలాంటి జోగి రమేశ్ ప్రస్తుతం అంతలో ఇంతలా ఎందుకు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే అంశంపై సదరు సర్కిల్‌లో భిన్నాభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణను ప్రస్తుతం జోగి రమేశ్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసును తాజాగా సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఈ కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా పలుమార్లు మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు జోగి రమేశ్ హాజరైన సంగతి తెలిసిందే. అలాగే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమ లావాదేవిలు జరిపారంటూ జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌‌తోపాటు జోగి రమేశ్ సోదరుడు వెంకటేశ్వరరావుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.

అధికారానికి వైసీపీ దూరం కావడం. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్‌ ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కోవడం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్‌తోపాటు జోగి వెంకటేశ్వరరావు పేర్ల మీద ఏసీబీ కేసు నమోదు చేశాయి. ఈ మొత్తం వ్యవహారంతో జోగి రమేశ్(Jogi Ramesh) ఫ్యామిలీ తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) భార్య సైతం మీడియాతో మాట్లాడుతూ.. కన్నీరు పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం పోలిటికల్ సర్కిల్‌లో పెద్ద చర్చే జరిగినట్లు తెలుస్తుంది. అన్ని నొప్పులకు ఒకటే మందు అన్నట్లుగా.. ఈ కేసుల నుంచి బయట పడాలంటే.. అన్నింటికి ఒకటే మందు సర్వ రోగ నివారిణి అన్నట్లుగా.. పార్టీ మారడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని జోగి రమేశ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

ఎన్నికలు జరిగి.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగి నాలుగు మాసాలు అయింది. ఆ క్రమంలో వైసీపీలోని పలువురు కీలక నేతలు ఇప్పటికే రాజీనామా చేసి.. టీడీపీలోకి వెళ్లిపోయారు. వారి మార్గాన్ని అనుసరించి.. వేడిలో వేడి ఇప్పుడు పార్టీ మారితే మారినట్లు.. లేకుంటే లేనట్లే అన్నట్లుగా జోగి రమేశ్ వ్యవహార శైలి ఉందని పోలిటికల్ సర్కిల్‌ ఓ ప్రచారం సాగుతుంది. అయితే జోగి రమేశ్ వైసీపీని వీడి.. ఈ రెండు పార్టీల్లోని ఏదో ఒకదానిలోకి వెళ్తారా? లేకుంటే బీజేపీలోకి జంప్ కోడితే.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు తనకు సేప్ అనుకుంటారా? అనే చర్చ సైతం సదరు సర్కిల్‌లో వాడి వేడిగా నడుస్తుంది.

Also Read : Nimmala Ramanaidu : జగన్ రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూనే ఇరిగేషన్ గాలికి వదిలేసారు

Leave A Reply

Your Email Id will not be published!