YSRCP Plenary : అన్ని దారులు వైసీపీ ప్లీనరీ వైపే
లక్షలాదిగా తరలి రానున్న శ్రేణులు
YSRCP Plenary : ఇవాళ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఆయనకు నివాళిగా తనయుడు వైఎస్ఆర్సీపీ చీఫ్, ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో శుక్ర, శని వారాలలో పార్టీ ప్లీనరీ(YSRCP Plenary) సమావేశాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రం నలు మూలల నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, శ్రేణులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా మూడో ప్లీనరీ నిర్వహిస్తున్నారు.
గతంలో ఇక్కడే రెండు సార్లు ప్లీనరీ ఏర్పాటు చేశారు. ప్లీనరీ ప్రాంగణానికి వైఎస్సార్(YSRCP Plenary) ప్రాంగణంగా పేరు పెట్టారు. వార్డు సభ్యుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా హాజరవుతున్నారు.
కార్యకర్త నుంచి సీఎం దాకా అందరికీ ఒకే మెనూ ఏర్పాటు చేశారు. రాయలసీ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సంప్రదాయ వంటకాలు సిద్దం చేశారు. టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ రెడీగా ఉంచారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు నిర్వాహకులు. మొత్తం 25 రకాల వంటకాలు అలరించనున్నాయి. ఈ ప్లీనరీ 8, 9 తేదీలలో కొనసాగుతుంది. రాష్ట్రం నలు మూలల నుంచి 4 లక్షల మందికి పైగా రానున్నట్లు అంచనా.
ఇక ప్లీనరీలో భాగంగా 9 తీర్మానాలపై చర్చ రుగుతుంది. ఇందులో మహిళా సాధికారిక దిశ చట్టం, విద్య వైద్యం, నవ రత్నాలు, పరిపాలన పారదర్శకత, సామాజక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎల్లో మీడియా ఆగడాలపై తీర్మానం చేయనున్నారు.
ఒక్కో నేత ఒక్కో తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దీనిపై ఐదుగురు సభ్యులకు చర్చించేందుకు చాన్స్ ఇచ్చింది పార్టీ.
Also Read : కాంగ్రెస్ లో చేరిన ఎర్ర శేఖర్