YSRCP : ఈ నెల 27 నుంచి విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం
పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు...
YSRCP : రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు పార్టీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 44 సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.
YSRCP Comment
పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ‘‘మేము ఎన్డీఏ పక్షం కాదు, ఇండియా పక్షం కాదు. మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. మేము మొదటి నుంచి చెప్తున్నం జెమిలి ఎన్నికలు వస్తాయని. జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడిని. జేపీసీ ప్రతి రాష్ట్రంలోని పర్యటిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుంది. జేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారు’’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
Also Read : Minister Hebbalkar : బీజేపీ సభ్యుడు సిటీ రవి మహిళ అనికూడా చూడకుండా అవమాన పరిచారు