Yuzvendra Chahal : భ‌య్యా నీతో స్నేహం అద్భుతం

రోహిత్ శ‌ర్మ‌కు ప్ర‌త్యేక గ్రీటింగ్స్

Also Read : మెరిడిత్ బౌన్స‌ర్ త‌ప్పించుకున్న బ‌ట్ల‌ర్

Yuzvendra Chahal : భార‌త క్రికెట్ స్టార్ హిట్ట‌ర్ , హిట్ మ్యాన్ ప్ర‌స్తుత మూడు ఫార్మాట్ ల‌కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించాడు స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్(Yuzvendra Chahal). వీరిద్ద‌రూ మంచి స్నేహితులు. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌కు ఈసారి ఐపీఎల్ క‌లిసి రాలేదు.

అయితే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో గెలుపొంద‌డం మాత్ర‌మే ఆనందం క‌లిగించింది. రోహిత్ శ‌ర్మ త‌న పుట్టిన రోజు జ‌రుపుకున్నారు.

ఈ సంద‌ర్బంగా క్రికెట్ తో పాటు ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, సెలెబ్రిటీలు బ‌ర్త్ డే విషెష్ తెలియ చేశారు. ఇదిలా ఉండ‌గా రోహిత్ శ‌ర్మ ఫ్యామిలీతో అత్యంత ద‌గ్గ‌రి సంబంధం ఉంది చాహ‌ల్ (Yuzvendra Chahal)కు.

వీళ్లిద్ద‌రూ చూస్తే అన్న‌ద‌మ్ములా అన్నంత ఫ్రీగా ఉంటారు. ఎక్క‌డ క‌లుసుకున్నా జోకులు వేస్తూ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అటు మైద‌నాంలోనూ ఇటు బ‌య‌ట కూడా. వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహ బంధం అపురూపం. అందుకే త‌న స్నేహితుడి పుట్టిన రోజును ప్ర‌త్యేకంగా అభినందించారు చాహ‌ల్.

భ‌య్యా నీతో స్నేహం ఎల్లప్ప‌టికీ ప‌దిలం అంటూ పేర్కొ్న్నాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క్రికెట‌ర్. వీరిద్ద‌రూ క‌లిసి ఎన్నో మ్యాచ్ లు ఆడారు. మరెన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాల‌లో పాలు పంచుకున్నారు.

ఇదిలా ఉండ‌గా మా ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం బంగారం కంటే విలువైన‌ది, వ‌జ్రం కంటే స్వ‌చ్ఛ‌మైన‌ద‌ని తెలిపాడు యుజ్వేంద్ర చాహ‌ల్. వీళ్లిద్ద‌రి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.

Also Read : మెరిడిత్ బౌన్స‌ర్ త‌ప్పించుకున్న బ‌ట్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!