Zaiba Sarang Logistics : జైబా సారంగ్ ఇథింక్ లాజిస్టిక్స్

త‌క్కువ కాలంలోనే మోస్ట్ పాపుల‌ర్

Zaiba Sarang Logistics : వ్యాపారంలో రాణించాలంటే భిన్నంగా ఆలోచించాలి. అంద‌రూ వెళ్లిన దారుల్లోనే వెళితే లైఫ్ కు అర్థం ఉండ‌దు. పురుషాధిక్య స‌మాజంలో మ‌హిళ‌లు రాణించాలంటే చాలా క‌ష్ట‌పడాల్సి ఉంటుంది. ఇలాంటి అద్భుత‌మైన ఐడియానే ఇథింక్ లాజిస్టిక్స్ ను ఏర్పాటు చేసేలా చేసింది. ప్ర‌స్తుతం గ‌ణ‌నీయ‌మైన ఆదాయం స‌మ‌కూరేలా చేసింది.

భార‌త దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లాజిస్టిక్స్ అగ్రిగేష‌న్ కంపెనీలలో ఒకటిగా పేరు పొందింది. దేశ వ్యాప్తంగా 26,000 కంటే ఎక్కువ పిన్ కోడ్ ల‌ను క‌లిగి ఉంది. కో ఫౌండ‌ర్ అయిన జైబా సారంగ్(Zaiba Sarang) ఇప్పుడు మోస్ట్ పాపుల‌ర్ వ్యాపార‌వేత్త‌గా రాణించారు.

సంస్థ‌ను తీర్చిదిద్ద‌డంలో వంద‌లాది మందికి ఉపాధి క‌ల్పించ‌డంలో ఆమె కృషి చేశారు. జైబా సారంగ్ విద్య ద్వారా ప్రేర‌ణ పొందారు. సాంకేతిక ప‌రిజ్ఞానం కోసం ఎక్కువ‌గా కంప్యూట‌ర్ పై ఆధార‌ప‌డ్డారు. కంప్యూట‌ర్ సైన్స్ లో బ్యాచిల‌ర్ డిగ్రీ పొందారు. కార్పొరేట్ సెక్టార్ లో ఎలా రాణించాల‌నే దానిపై డిప్లొమా కూడా చేశారు.

గోల్డ్మ‌న్ సాచ్స్ ఉమెన్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాం కింద బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుండి వ్య‌వ‌స్థాక ప‌త్రాన్ని పొందారు. 2018లో జైబా సారంగ్ చేసిన కృషికి గుర్తింపుగా 2018లో టెక్ 30 స్టార్ట‌ప్స్ ఆఫ్ ఇండియా కింద ఎంపిక‌య్యారు.

విజ‌యం ఏ ఒక్క‌రి సొత్తూ కాదు. ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నం చేయాలి. క‌ష్ట‌ప‌డితే, స‌రైన దారిలో ప్ర‌యాణం చేస్తే స‌క్సెస్ త‌నంత‌కు తానుగా వ‌స్తుంద‌ని న‌మ్ముతారు జైబా సారంగ్(Zaiba Sarang Logistics). ఆమె చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ గా ఇన్ఫోటెక్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తోటి పారిశ్రామిక‌వేత్త‌ల‌తో క‌లిసి 2017లో ఓ సంస్థ‌ను కూడా ఏర్పాటు చేశారు.

Also Read : ‘బైజు’కు దివ్య గోకుల్ నాథ్ దిక్సూచి

Leave A Reply

Your Email Id will not be published!