ZIM vs BAN 3rd T20 : అబ్బా రియాన్ బర్ల్ దెబ్బ
బంగ్లాకు జింబాబ్వే బిగ్ షాక్
ZIM vs BAN 3rd T20 : ఊహించని రీతిలో బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చింది జింబాబ్వే. ఆ జట్టు తాజాగా ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. జింబాబ్వే కొట్టిన దెబ్బకు బంగ్లాదేశ్(ZIM vs BAN 3rd T20) విలవిల లాడింది.
జింబాబ్వే బ్యాటర్ రియాన్ బర్ల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బర్ల్ 2 ఫోర్లు 6 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 54 పరుగులు చేశాడు.
ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టే అవకాశాన్ని మిస్ అయ్యాడు ఈ బ్యాటర్. మ్యాచ్ సందర్భంగా జరిగిన 15వ ఓవర్ లో నసుమ్ అహ్మద్ కు చుక్కలు చూపించాడు.
ఆ ఓవర్ లో రియాన్ బర్ల్ 6, 6, 6, 6, 4, 6 కొట్టాడు. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. కానీ ఐదో బంతిని సిక్సర్ గా మల్చలేక పోయాడు. ఆ బాల్ ఫోర్ వచ్చింది. దీంతో ఆ ఒక్క ఓవర్ లో 34 పరుగులు చేశాడు రియన్ బర్ల్.
ఇక పొట్టి ఫార్మాట్ కు సంబంధించి ఇప్పటి వరకు భారత్ కు చెందిన స్టార్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇక వెస్టిండీస్ కు చెందిన కీరన్ పొలార్డ్ ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించారు.
తాజాగా జింబాబ్వే బ్యాటర్ 5 సిక్సర్లు ఒక ఫోర్ కొట్టాడు. టి20 హిస్టరీలో మూడో బ్యాటర్ గా నిలిచాడు రియాన్ బర్ల్. అంతే కాకుండా మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ ను ఊహించని రీతిలో 2-1 తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించి చరిత్ర సృష్టించింది.
జింబాబ్వే 156 రన్స్ చేస్తే బంగ్లా 8 వికెట్లు కోల్పోయి 146 రన్స్ మాత్రమే చేసింది.
Also Read : ‘యాదవ్’ షాన్ దార్ భారత్ జోర్దార్