Rajasthan CM : రాజస్థాన్ లో 100 రోజుల ఉపాధి పథకం
శ్రీకారం చుట్టిన సీఎం అశోక్ గెహ్లాట్
Rajasthan CM : రాజస్థాన్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్న సదుద్దేశంతో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు 100 రోజుల ఉపాధి కల్పించే పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్ మెంట్ స్కీం అని పేరు పెట్టారు. దీనిని ప్రారంభించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు సీఎం గెహ్లాట్(Rajasthan CM) .
అధిక ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో తమ ఆదాయాన్ని పెంచు కోవాలనుకునే ఏ కుటుంబమైనా దీని కింద ఉద్యోగాలు పొంద వచ్చని చెప్పారు అశోక్ గెహ్లాట్.
ఈ పథకం కింద పని లేదా ఉపాధి పొందాలని అనుకునే వారికి ఎలాంటి కులం, మతం, ప్రాంతం, వయోభేదం ఉండాల్సిన అవసరం లదేన్నారు.
18 నుండి 60 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఈ స్కీంకు అర్హులని స్పష్టం చేశారు అశోక్ గెహ్లాట్. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతాలలోని కుటుంబాలకు ఉద్దేశించినదని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ పథకాన్ని సిద్దం చేశామన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో దీనిని ప్రారంభించారు రాజస్తాన్ సీఎం(Rajasthan CM) .
ఈ సందర్భంగా పది మంది మహిళా లబ్దిదారులకు జాబ్ కార్డులను అందజేశారు. ఈ స్కీం కింద పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, వారసత్వ సంపద పరిరక్షణ, ఉద్యానవనాల నిర్వహణ, ఆక్రమణల తొలగింపు , హోర్డింగ్ లు, బ్యానరలు, పారిశుధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Also Read : కాంగ్రెస్ చీఫ్ ఎన్నికపై థరూర్ కామెంట్స్