AP IAS Officers Transfers: ఏపీలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ
ఏపీలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ
AP : ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. బాగా పని చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు టీటీడీ (TTD) ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా… రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్ మీనా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP – ప్రభుత్వం బదిలీ చేసిన ఐఏఎస్ ల జాబితా ఇదే
జి. అనంత రాము – పర్యావరణ అటవీ విభాగం నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం
అనిల్ కుమార్ సింఘాల్ – తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా నియామకం
ఎం.టి. కృష్ణబాబు – హెల్త్ విభాగం నుండి రోడ్లు, భవనాల శాఖకు బదిలీ. అదనంగా ఇన్ఫ్రా & ఇన్వెస్ట్మెంట్స్ బాధ్యతలు కూడా
జె. శ్యామలారావు – టీటీడీ నుండి వెనక్కి – జీఏడీ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం
ముఖేశ్ కుమార్ మీనా – జీఏడీ నుండి రెవెన్యూ (ఎక్సైజ్) విభాగానికి బదిలీ. అదనంగా మైన్స్ విభాగం బాధ్యతలు కూడా
కాంతిలాల్ దాండే – రోడ్లు, భవనాల నుండి పర్యావరణ & అటవీ విభాగానికి బదిలీ
సౌరభ్ గౌర్ – సివిల్ సప్లైస్ నుండి హెల్త్ శాఖ సెక్రటరీగా, సివిల్ సప్లైస్ అదనపు బాధ్యతలు కొనసాగింపు
ప్రవీణ్ కుమార్ – మైన్స్ నుండి ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ
సీ హెచ్. శ్రీధర్ – మైనారిటీస్ వెల్ఫేర్ సెక్రటరీగా నియామకం. అదనంగా కమిషనర్ బాధ్యతలు
ఎం.వి. శేషగిరి బాబు – లేబర్ విభాగం సెక్రటరీగా నియామకం. అదనంగా కమిషనర్ బాధ్యతలు.
ఎం.హరి జవహర్ లాల్ (రిటైర్డ్) – గవర్నర్ కార్యాలయం నుంచి రెవెన్యూ (ఎండోమెంట్స్) విభాగానికి బదిలీ.
Also Read : Minister Nara Lokesh: తమిళనాడు బీజేపీ నేత అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ
