Ukraine Russia War : 11 వేల మంది ర‌ష్య‌న్ సైనికులు ఖ‌తం

ప్ర‌క‌టించిన ఉక్రేయిన్ ప్ర‌భుత్వం

Ukraine Russia War : త‌న కంట్లో న‌లుసుగా మారిన ఉక్రెయిన్ పై మూకుమ్మ‌డి దాడుల‌కు పాల్ప‌డుతున్న ర‌ష్యాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే చ‌ని పోయినా స‌రే త‌మ భూమిని ప‌రుల ప‌రం కానీయ‌మంటూ ఆ దేశ ప్ర‌జ‌లు పోరాడేందుకు సిద్ద‌మ‌య్యారు.

మ‌రో వైపు ఉక్రెయిన్ చీఫ్ గెలెన్ స్కీ(Ukraine Russia War) సైతం తానే ముందుండి ఆర్మీని న‌డిపిస్తున్నాడు. ఈ త‌రుణంలో ఐదున్న‌ర గంట‌ల పాటు యుద్ద విరామం అని ప్ర‌క‌టించిన ర‌ష్యా అంత‌లోనే మాట మార్చింది.

ఈ విష‌యంపై నోరు విప్పాడు జెలెన్ స్కీ. రాజ‌నీతి, యుద్ద నీతి త‌ప్పిన పుతిన్ కాల్పుల విర‌మ‌ణకు తిలోద‌కాలు ఇచ్చాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం ర‌ష్యా ఆధీనంలో 4 ల‌క్ష‌ల మంది జ‌నం ఉన్నార‌ని వాపోయాడు.

ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్, ర‌ష్యా దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్దంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉక్రెయిన్ చాలా కోల్పోయింది. వంద‌లాది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ర‌ష్యా దాడుల‌కు ధీటుగా జ‌వాబు ఇస్తోంది ఉక్రెయిన్.

ఇవాళ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది ఆదేశ ప్ర‌భుత్వం. ఇప్ప‌టి వ‌ర‌కు 11 వేల మంది ర‌ష్య‌న్ సైనికుల‌ను హ‌త‌మార్చామంటూ డిక్లేర్ చేసింది. ఇవాల్టితో యుద్దం ప్రారంభ‌మై 11 రోజులు కావ‌స్తోంది.

చ‌ర్చ‌లకు సిద్ద‌మంటూనే ర‌ష్యా దాడుల‌కు పాల్ప‌డుతోంది. స్వ‌ల్ప కాల్పుల విర‌మ‌ణ త‌ర్వాత మ‌రోసారి విరుచుకు ప‌డింది ర‌ష్యా. మాన‌వ‌తా దృక్ఫ‌థంతో విదేశీయులు త‌మ దేశాల‌కు వెళ్లేలా అనుమ‌తి ఇవ్వాల‌ని ర‌ష్యాను కోరాయి ఇత‌ర దేశాలు.

కానీ ర‌ష్యా మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. దాడుల‌కు తెగ బ‌డుతోంది.

Also Read : ర‌ష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!