Ashwini Vaishnaw : కేంద్రం ఖుష్ కబర్ చెప్పింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,275 రైల్వే స్టేషన్లు అప్ గ్రేడ్ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. స్టాటిక్ లేదా మొబైల్ యూనిట్ల ద్వారా ప్రయాణీకులకు క్యాటరింగ్ సేవలను అందించామని తెలిపింది. ఇందుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంట్ సభ్యుల సంప్రదింపుల కమిటీ తీర్మానం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని తీసుకు వచ్చింది కేంద్రం. భారతీయ రైల్వేలలో స్టేషన్ అభివృద్దిని ప్రేరేపించేందుకు ఎజెండాతో భారతీయ రైల్వేలలో సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు ఎంపీలు హాజరయ్యారు.
భారతీయ రైల్వేలలో ప్రతి రోజూ సుమారు 1.8 కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు మంత్రి అశ్విని వైష్ణవ్. ఆయా స్టేషన్ లలో తగిన క్యాటరింగ్ సౌకర్యాల ఏర్పాటు ,లభ్యతను నిర్దారించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని సభ్యులకు తెలిపారు కేంద్ర మంత్రి.
రైల్వేలు కేటరింగ్ సేవలపై లోతైన విశ్లేషణను చేపట్టడమే కాకుండా గత కొన్ని ఏళ్లుగా క్యాటరింగ్ వ్యాపారంలో ఒక నమూనా మార్పును తీసుకు రావడానికి నిర్మాణాత్మక సంస్కరణలను కూడా ప్రారంభించామని తెలిపారు.
Also Read : Delhi Court Sisodia
