Hanuman Rally : హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపుపై రాళ్లు(Hanuman Rally) రువ్వారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో గత రాత్రి ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.
ఈ ఘటనలో 14 మంది అరెస్ట్ చేశారు. రాళ్ల దాడి తర్వాత 8 మంది పోలీసులు , ఒక పౌరుడు సహా మొత్తం తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. అతని చేతికి బుల్లెట్ గాయం కావడం గమనార్హం. అయితే ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
అరెస్ట్ అయిన వారిలో కాల్పులు జరిపిన అస్లాం కూడా ఉన్నాడు. అతని నుంచి ఒక కంట్రేమేడ్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాళ్ల దాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, వడియోలను ఉపయోగించి మరికొందరిని గుర్తించామని చెప్పారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు పోలీసులు.
అల్లర్లు, హత్యాయత్నం, ఆయుధ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ అధికారులు 10 టీమ్ లను ఏర్పాటు చేశారు.
ర్యాలీ మసీదు గుండా వెళుతుండగా అన్సార్ ర్యాలీలో పాల్గొన్న వారితో వాగ్వాదానికి దిగాడు. ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డాయి.
ఢిల్లీలోని పలు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. శాంతి కమిటీ ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అస్థానా.
Also Read : పీకేకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్