IT Raids : ఐటీ దాడుల్లో 2 కోట్లు పట్టివేత 100 కోట్లపై ఆరా
కోట్ల లావాదేవీలకు సంబంధించి ఆధారాలు లేవు
IT Raids : కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు ఇప్పుడు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు సమన్లు జారీ చేసింది. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. ఈ తరుణంలో జేఎంఎం సర్కార్ ను టార్గెట్ చేయడంతో ఒకదాని వెంట మరొక కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు జార్ఖండ్ పై పూర్తిగా ఫోకస్ పెట్టాయి.
మంగళవారం ఆదాయా పన్ను శాఖ (ఐటీ) జార్ఖండ్ లో దాడులు(IT Raids) చేపట్టింది. రూ. 2 కోట్ల నగదు లభించగా రూ. 100 కోట్లకు సంబంధించి లెక్కలు చూపని లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.
ఇదిలా ఉండగా రాంచీ, గొడ్డా, దుమ్కా, జంషెడ్ పూర్ , చైబాసా, పాట్నా, గురుగ్రామ్, కోల్ కతా లోని 50కి పైగా ప్రాంగణాల్లో కూడా సోదాలు చేపట్టింది ఐటీ శాఖ. చైబాసా, జంషెడ్ పూర్ లోని బొగ్గు వ్యాపారులు, వారికి సంబంధించిన ఇతర ప్రదేశాలలో కూడా దాడులు చేపట్టింది ఐటీ శాఖ.
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొంత మంది వ్యాపారులతో సంబంధం ఉన్న జార్ఖండ్ లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ దాడులు చేపట్టిన తర్వాత తాజాగా మరోసారి దాడులు చేపట్టడం కలకలం రేపింది రాష్ట్రంలో.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ దీనిపై వివరణ కూడా ఇచ్చింది. లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇంత వరకు పొందు పర్చలేదని పేర్కొంది.
సెర్చ్ ఆపరేషన్ లో భారీ సంఖ్యలో నేరారోపణ పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.
Also Read : ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్