Rahul Gandhi : అదానీ మోసం మోదీ మౌనం – రాహుల్
ప్రధానమంత్రి తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్ నేత
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. అదానీ విషయంలో ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అదానీ షెల్ కంపెనీల్లో 20,000 కోట్లు ఉన్నాయని , ఆ బినామీ సొమ్ము ఎవరిదో చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోదీపై ఉందన్నారు. ఇప్పటి వరకు తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు నేటి దాకా సమాధానం చెప్పిన పాపాన పోలేదని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
తనకు అబద్దాలు చెప్పడం రాదన్నారు. తాను గత కొంత కాలం నుంచీ చైనా ఎలా దాడికి దిగబోతోందో, భారత భూభాగంలోకి ఎలా చొచ్చుకు వస్తుందో ముందే హెచ్చరిస్తూ వచ్చానని చెప్పారు రాహుల్ గాంధీ. అయితే ఇవాళ చైనా అరుణా చల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు పేర్లు కూడా పెట్టిందని ఈ విషయంలో ఎందుకు కేంద్ర సర్కార్ నోరు మెదపడం లేదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇప్పటి వరకు చైనా అక్రమంగా 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని దౌర్జన్యంగా లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాల పేర్లు కూడా మారుతున్నాయని అయినా ప్రధానమంత్రి మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. ఈ మౌనం దేని కోసమో చెప్పలేరా అంటూ నిలదీశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం రాహుల్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : భారత్ సహకారం శ్రీలంకకు అవసరం