Odisha Cabinet : ఒడిశా కేబినెట్ లో 21 మంది ప్రమాణం
కొత్తగా మంత్రివర్గం విస్తరణ
Odisha Cabinet : ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా మంత్రివర్గాన్ని పునరుద్దరించారు. నూతనంగా 21 మందిని తీసుకున్నారు.
వీరు ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడుగురు మొదటి సారిగా మంత్రులుగా కొలువుతీరారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ఇదే సమయంలో కొత్తగా కొలువు తీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇక ఒడిశా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొలువు తీరాక తన 22 ఏళ్ల పాలనలో మొదటిసారిగా కేబినెట్(Odisha Cabinet) ను భారీగా విస్తరించారు.
కాగా ఇప్పటి వరకు ఉన్న కేబినెట్ మూకుమ్మడిగా రాజీనామా చేసింది. అనంతరం ఒక రోజు తర్వాత కొత్త వారిని తీసుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని లోక సేవా భవన్ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో 13 మంది కేబినెట్(Odisha Cabinet) మంత్రులుగా కొలువు తీరగా మరో 8 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇప్పటి వరకు ఒడిశా కేబినెట్ లో మంత్రులుగా కొలువు తీరిన వారిలో జగన్నాథ్ సరకా, తుకుని సాహూ, ప్రమీలా మల్లిక , రణస్త్రంద్ర ప్రతాప్ స్వైన్ , తుషార కాంతి బెహెరా, నవా కిషోర దాస్ , సమీర్ రంజన్ దాస్ , ప్రతాక్ కేశరీ దేబ్ , అతాను సబ్యసాచి, రోహిత్ పూజారి, రాజేంద్ర ధోలాకియా ఉన్నారు.
వీరితో పాటు సబితా హెంబ్రామ్ , శ్రీకాంత సాహు, అశ్విని పాత్ర, అశోక్ పాండా, ఉషా దేవి, నిరంజన్ పూజారి, ప్రీతి రంజన్ ఘడేయ్, ప్రదీప్ అమత్, రీటా సాహూ ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read : కాశ్మీర్ ముమ్మాటికీ భారత్ దే – కేజ్రీవాల్