Tourist Boat Capsizes : ప‌డ‌వ బోల్తా 22 మంది దుర్మ‌ర‌ణం

పీఎం ప్ర‌ధాని, సీఎం , రాహుల్ సంతాపం

Tourist Boat Capsizes : కేర‌ళ‌లో ఘోర ప్ర‌మాదం సంభవించింది. టూరిస్ట్ బోట్ బోల్తా(Tourist Boat Capsizes) ప‌డిన ఘ‌ట‌న‌లో 22 మంది మ‌ర‌ణించారు. ఇంకా ఎంత మంది గ‌ల్లంత‌య్యార‌నే దానిపై వివ‌రాలు అందాల్సి ఉంది. మ‌లప్పురం లోని తానూరు ప్రాంతం తువ‌ల్తిరామ్ బీచ్ స‌మీపంలో రాత్రి 7 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మై ఉన్నారు.

డబుల్ డెక్క‌ర్ ప‌డ‌వ బోల్తా ప‌డి మునిగి పోవ‌డంతో ఏడుగురు చిన్నారులు స‌హా క‌నీసం 22 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. బోటు య‌జ‌మానిపై(Tourist Boat Capsizes) హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప‌డ‌వ‌లో ప్ర‌యాణీకుల ఖ‌చ్చిత‌మైన సంఖ్య ఇంకా తెలియ‌న‌ప్ప‌టికీ 40 మంది టికెట్లు క‌లిగి ఉన్నారు. సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఉన్న‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా బోటుకు సేఫ్టీ స‌ర్టిఫికెట్ కూడా లేద‌ని తెలిసింది.

విష‌యం తెలిసిన వెంట‌నే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల‌కు ఒక్కొక్క‌రికి రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకవాల‌ని కాంగ్రెస్ నేత‌, వాయ‌నాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.

Also Read : బీహార్ సీఎం నితీశ్ ను క‌లుస్తా – ప‌వార్

Leave A Reply

Your Email Id will not be published!