Mass Wedding Record : కేవలం 12 గంటలలో ఏకంగా 2,413 మందికి పైగా నూతన వధూ వరులు పెళ్లి చేసుకున్నారు. ఇది దేశంలోనే ఓ రికార్డు కాగా ఏకంగా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ ఆసక్తికరమైన సన్నివేశం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. బరాన్ లో మే 26న సామూహిక వివాహ వేడుక(World recored of 2431 weddings in one day) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఒక్క జంట ఆరు గంటల లోపు వివాహం చేసుకోవడం విశేషం.
ఈ మెగా ఈవెంట్ లో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఎక్కువగా హిందూ, ముస్లిం జంటలు ఉన్నారు. ప్రపంచ రికార్డు సృష్టించారు. వరల్డ్ గిన్నిస్ రికార్డ్ ప్రకారం 2013లో 24 గంటల్లో 963 జంటలు ఏకకాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి మీదే ఈ రికార్డు నమోదైంది. కానీ ఆ రికార్డును భారత దేశానికి చెందిన రాజస్థాన్ జంటలు చెరిపేశారు. తమ పేరుతో కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక వివాహాల రికార్డును బద్దలు కొట్టారు.
ఈ సామూహిక వివాహ కార్యక్రమాన్ని శ్రీ మహావీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ నిర్వహించింది. సమాజంలోని నిరాదరణకు గురైన వారిని చేర దీయడం, వారికి ఆసరా కల్పించడం సదరు సంస్థ లక్ష్యం. అణగారిన జంటలను ఒకే చోటుకు చేర్చడం ఉద్దేశం. మొదటగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత తాళి కట్టారు.
ఈ సామూహిక కార్యక్రమం పూర్తిగా శాస్త్రోక్తంగా జరిగింది. హిందువుల జంటలకు సంబంధించి పూజారులు, ముస్లింలకు సంబంధించి క్వాజీల ఆధ్వర్యంలో పెళ్లిళ్లు జరిగాయి. ఇక పెళ్లి చేసుకున్న జంటకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ , మంత్రి ప్రమోద్ జైన్ భయా జంటను ఆశీర్వదించారు.
Also Read : Nara Lokesh : జగన్ పాలన నరక యాతన – లోకేష్
