10th Paper Leak : టెన్త్ పేపర్ లీక్ లో ముగ్గురిపై వేటు
ఆలస్యంగా మేలుకున్న విద్యా శాఖ
10th Paper Leak : తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి తొలి పేపర్ లీక్ కావడం కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. విచిత్రం ఏమిటంటే వేల రూపాయలు జీతం తీసుకుంటూ పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు గతి తప్పడం విస్తు పోయేలా చేసింది. ప్రభుత్వ టీచర్ గా ఉన్న బందెప్ప ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
తాండూరులో పదవ తరగతి పరీక్ష పత్రం లీకైంది(10th Paper Leak). బందెప్ప తన సెల్ ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా ఇతరులకు షేర్ చేసినట్లు గుర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట దీనికి సంబంధించి సమాచారం వచ్చినా దానిని నిర్దారించ లేదు. విద్యా శాఖ అధికారులు బుకాయించే ప్రయత్నం చేశారు. చివరకు వాట్సాప్ లో ప్రశ్నా పత్రం చక్కర్లు కొట్టడంతో మేలుకున్నారు. తమ తప్పు తెలుసుకున్నారు.
చివరకు 10వ తరగతి ఎగ్జామ్ పేపర్ బయటకు వెళ్లిన ఘటనకు సంబంధించి ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్ , ఇన్విజిలేటర్ తో పాటు మరొకరిపై వేటు వేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పేపర్ లీక్ ఘటనపై జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకా దేవి సమావేశం అయ్యారు.
ప్రస్తుతం సీరియస్ గా చర్చిస్తున్నారు ఈ అంశంపై. మరో వైపు పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Also Read : నిన్న టీఎస్పీఎస్సీ నేడు టెన్త్ పేపర్