Nagaland Killings : సిట్ ద‌ర్యాప్తులో 30 ఆర్మీ జ‌వాన్ల పేర్లు

చ‌ర్య‌కు నాగాలాండ్ ప్ర‌భుత్వం లేఖ‌

Nagaland Killings : గ‌త ఏడాది నాగాలాండ్ లో చోటు చేసుకున్న ఆక‌స్మిక దాడి కేసులో అప్ డేట్ వ‌చ‌చింది. రాష్ట్ర పోలీసులు త‌యారు చేసిన ఛార్జిషీట్ లో 30 మంది సైనికుల పేర్లు ఉన్నాయి.

త‌మ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బందం లేదా సిట్ చార్జి షీట్ ను కోర్టుకు అందించింద‌ని నాగాలాండ్(Nagaland Killings) రాష్ట్ర పోలీస్ చీఫ్ తెలిపారు.

14 మంది పౌరుల‌ను బ‌లిగొన్నారు.

విచ‌క్ష‌ణా ర‌హితంగా ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు ఆర్మీ జ‌వాన్లు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం

క‌లిగించింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

సిట్ పూర్తి ద‌ర్యాప్తు లో ఒక ఆర్మీ ఆఫీస‌ర్ తో పాటు 29 మంది సైనికుల పేర్లు ఉండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సైనికులు ప్రామాణిక ఆప‌రేష‌న్ విధానాలు , ఎస్ఓపీలు నియ‌మాల‌ను పాటించ లేద‌ని సిట్ ఆరోపించింది.

రాత్రి పిక‌ప్ ట్ర‌క్కులు ఇంటికి తిరిగి వ‌స్తున్న 14 మంది పౌరుల‌పై కాల్పులకు పాల్ప‌డ్డారు. ఉగ్ర‌వాదులేమోనంటూ పొర‌పాటు ప‌డ్డామ‌ని ఆ త‌ర్వాత స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత పెద్ద ఎత్తున పౌరులు ఆర్మీకి చెందిన వాహ‌నాన్ని త‌గుల‌బెట్టారు. 144 సెక్ష‌న్ జారీ చేయాల్సి వ‌చ్చింది. ఈ మొత్తం

ఘ‌ట‌న‌లో 21 మంది పారా స్పెష‌ల్ ఫోర్సెస్ సైనికులు ఎలాంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు పాటించ లేద‌ని సిట్ స్ప‌ష్టం చేసింది.

4 డిసెంబ‌ర్ 2021న జ‌రిగిన ఈ సంఘ‌ట‌న త‌ర్వాత కోపంతో జ‌వాన్ల‌ను చుట్టుముట్టారు గ్రామ‌స్తులు. వారంతా జ‌రిపిన దాడిలో ఒక సైనికుడు మ‌ర‌ణించాడు.

ఛార్జిషీట్ లో పేర్కొన్న సైనికుల‌పై చ‌ర్య తీసుకునేందుకు నాగాలాండ్(Nagaland Killings) ప్ర‌భుత్వం కేంద్రాన్ని అనుమ‌తి కోరింది. రాష్ట్ర పోలీసులు కూడా ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు లేఖ కూడా పంపారు.

కాగా నాగాలాండ్ లో ఎక్కువ భాగం సాయుధ ద‌ళాల అధికారాల చ‌ట్టం కింద ఉంది.

Also Read : బీజేపీ నిర్వాకం ప్ర‌జ‌ల‌కు శాపం – దీదీ

Leave A Reply

Your Email Id will not be published!