Bhagwant Mann : ప్ర‌తి ఇంటికి 300 యూనిట్ల క‌రెంట్ ఫ్రీ – సీఎం

పంజాబ్ లో నెల రోజులు పూర్తి చేసుకున్న మాన్

Bhagwant Mann  : పంజాబ్ లో బంప‌ర్ మెజారిటీ సాధించి సీఎంగా కొలువు తీరిన భ‌గ‌వంత్ మాన్ ప‌ద‌వీ కాలం ఇవాల్టితో నెల రోజులు పూర్త‌యింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం.

పంజాబ్ లో ని ప్ర‌తి ఇంటికి 300 యూనిట్ల ఉచిత క‌రెంట్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann )నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఇవాళ ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

ఈ ఉచిత విద్యుత్ ప‌థ‌కం వ‌చ్చే జూలై నెల ఒక‌టి నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని తెలిపింది. రాష్ట్ర స‌మాచార‌, ప్ర‌జా సంబంధాల శాఖ ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించింది.

ప్ర‌భుత్వం కొలువు తీరి నెల రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా ఈ వారంలో ప్ర‌జ‌లంద‌రికీ శుభ‌వార్త తెలియ చేస్తాన‌ని నిన్న ప్ర‌క‌టించారు సీఎం భ‌గ‌వంత్ మాన్.

ఇవాళ ఆ గుడ్ న్యూస్ ఇదేనంటూ చెప్పారు సీఎం. త‌మ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో స‌మావేశం ముగిసింది. మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నాన‌ని తెలిపారు భ‌గ‌వంత్ మాన్.

ఇదే విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించింది.

ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా విద్యుత్ అంద‌జేస్తామ‌ని చెప్పారు. దీని ప్ర‌కారం ఇచ్చిన హామీని నిల‌బెట్టు కోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు భ‌గ‌వంత్ మాన్.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని ఆప్ స‌ర్కార్ 200 యూనిట్ల వ‌ర‌కు ఉచితంగా క‌రెంట్ ఇస్తోంది.

Also Read : రాముడు దేవుడంటే ఒప్పుకోం – మాజీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!