31 Killed UP : యూపీలో ప్ర‌మాదం 27 మంది దుర్మ‌ర‌ణం

కాన్పూరులో రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో

31 Killed UP : ఉత్త‌ర ప్ర‌దేశంలో చోటు చేసుకున్న రోడ్డు ప్ర‌మాదాల్లో ప‌లువురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. కాన్పూర్ లో కేవ‌లం 2 గంట‌ల వ్య‌వ‌ధిలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లో 31 మంది మృతి(31 Killed UP) చెంద‌గా 20 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గ‌త రాత్రి కాన్పూర్ లోని ఘ‌తంపూర్ ప్రాంతంలో 50 మంది యాత్రికుల‌తో వెళుతున్న ట్రాక్ట‌ర్ ట్రాలీ బోల్తా ప‌డింది.

చెరువులో మున‌గ‌డంతో మొద‌టి ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇందులో 26 మంది యాత్రికులు, వారిలో ఎక్కువ మంది మ‌హిళ‌లు, పిల్ల‌లు ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఉన్నావ్ లోని చంద్రికా దేవి ఆల‌యం నుంచి ట్రాక్ట‌ర్ తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు సార్హ్ పోలీస్ స్టేష‌న్ ఇన్ చార్జిని స‌స్పెండ్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌మాద స్థ‌లానికి పోలీసు బ‌ల‌గాల‌ను త‌ర‌లించ‌డంలో జాప్యం చేసినందుకు ఈ చ‌ర్య తీసుకున్నారు. మ‌రో ప్ర‌మాదంలో అహిర్వాన్ ఫ్లై ఓవ‌ర్ స‌మీపంలో లోడ‌ర్ టెంపోను వేగంగా వ‌స్తున్న ట్ర‌క్కు ఢీకొంది.

ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఏడుగురికి తీవ్రంగా గాయాల‌య్యాయి. బాధితుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు. యాత్రికులు మృతి చెంద‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

బాధిత కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు ఒక్కొక్క‌రికి రూ. 50,000 ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని తెలిపారు.

Also Read : స‌త్తా చాటిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!