Kanpur Violence : కాన్పూరులో ఉద్రిక్త‌త 36 మంది అరెస్ట్

బీజేపీ స్పోక్స్ ప‌ర్స‌న్ కామెంట్స్ క‌ల‌క‌లం

Kanpur Violence : ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని కాన్పూర్ లో తీవ్ర ఉద్ర‌క్త‌త చోటు చేసుకుంది. మ‌హమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికార ప్ర‌తినిధి నూపుర్ శ‌ర్మ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇరు వ‌ర్గాల‌కు చెందిన 30 మంది గాయ‌ప‌డ‌డంతో పాటు 13 మంది పోలీసుల‌కు గాయాలైన‌ట్లు స‌మాచారం.

దీంతో న‌గ‌రంలో భారీ ఎత్తున భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ప్రార్థ‌న‌లు చేసిన అనంత‌రం కాన్పూరు(Kanpur Violence)  లోని కొన్ని ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.

బీజేపీ అధికార ప్ర‌తినిధి చేసిన అవ‌మాన‌క‌రమైన వ్యాఖ్య‌ల‌పై చెల‌రేగిన హింస‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు 36 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పాల్గొన్న వ్య‌క్తుల‌ను గుర్తించేందుకు వీడియో క్లిప్ ల‌ను ప‌రిశీలించాక అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌పై ఎఫ్ఐఆర్ లు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

వీటి ఆధారంగా మ‌రికొంద‌రిని గుర్తించే ప‌నిలో ప‌డ్డామ‌ని స్పష్టం చేశారు కాన్పూర్(Kanpur Violence) పోలీస్ క‌మిష‌న‌ర్ విజ‌య్ సింగ్ మీనా తెలిపారు. కుట్ర‌దారుల‌పై గ్యాంగ్ స్ట‌ర్ చ‌ట్టం కింద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని , వారి ఆస్తుల‌ను సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

బీజేపీ నేత చేసిన కామెంట్స్ ను నిర‌సిస్తూ మార్కెట్ ల‌ను మూసి వేయాల‌ని పిలుపునిచ్చారు. దీనిపై రెండు గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు రాళ్లు రువ్వుకున్నారు.

కొంత మంది యువ‌కులు అక‌స్మాత్తుగా వీధుల్లోకి వ‌చ్చారు. నినాదాలు చేయ‌డం ప్రారంభించారు. దానిని వ్య‌తిరేకించ‌డంతో రాళ్ల దాడికి దారి తీసింద‌న్నారు మీనా.

Also Read : కాశ్మీర్ కాల్పుల వెనుక పాకిస్తాన్ హ‌స్తం

Leave A Reply

Your Email Id will not be published!