AP Govt Transferred : ఏపీలో ఐపీఎస్ లకు స్థాన చలనం
కోలుకోలేని షాక్ ఇచ్చిన జగన్ సర్కార్
AP Govt Transferred : జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలువురు ఐపీఎస్ లు, ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఎన్నికలు రానుండడంతో వీరి బదిలీ(AP Govt Transferred) జరిగినట్లు సమాచారం. మొత్తం 39 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
త్వరలోనే ఎన్నికలు రానుండడంతో తమకు అనుకూలంగా ఉండే వారిని నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బదిలీ అయిన వారిలో విక్రాంత్ పాటిల్ పార్వతీపురం మన్యం ఎస్పీగా, వాసన్ నాయుడు లా అండ్ ఆర్డర్ డీసీపీ విశాఖ సిటీకి మార్చారు. గరుడ సుమిత్ సునీల్ ఎస్పీ, ఎస్ఐబీకి, తుహిన్ సిన్హా అల్లూరి జిల్లా ఎస్పీగా , సతీష్ కుమార్ కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది.
కేవీ మురళీకృష్ణ అనకాపల్లి జిల్లా ఎస్పీగా , గౌతమి శాలిని ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్ గా , సుధీర్ కుమార్ రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా, పి. శ్రీధర్ ను కోనసీమ జిల్లా ఎస్పీగా , మేరీ ప్రశాంతిని ఏలూరు జిల్లా ఎస్పీగా , రాహుల్ దేవ్ శర్మను ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేసింది. ఇక తిరుమలేశ్వర్ రెడ్డిని నెల్లూరు జిల్లా ఎస్పీగా , ఆర్ . గంగాదర్ రావు ను అన్నమయ్య జిల్లా ఎస్పీగా , విజయ రావును ఏపీఎస్పీ 3వ బెటాలియాన్ కమాండెంట్ గా ట్రాన్స్ ఫర్ చేసింది.
సీఐడీ ఎస్పీగా హర్షవర్దన్ రాజు, అనంతపురం జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు, సీఐడీ ఎస్పీగా ఫకీరప్ప, సత్య జిల్లా ఎప్పీ గా ఎస్వీ మాధవరెడ్డిని బదిలీ చేసింది. రాహుల్ దేవ్ సింగ్ ను విజయవాడ రైల్వే ఎస్పీగా , కృష్ణ కాంత్ ను కర్నూల్ ఎస్పీగా , సిద్దార్త్ కౌశల్ ఆక్టోపస్ ఎస్పీగా , పి. జగదీశ్ ను ఏపీఎస్పీ 14వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేసింది.
గ్రే హాండ్స్ ఎస్పీగా బిందు మాధవ్ , ఎలిరి రేంజ్ డీఐజీగా అశోక్ కుమార్ , గుంటూర్ రేంజ్ ఐజీగా పాలరాజు, అనంతపురం రేంజ్ డీఐజీగా అమ్మి రెడ్డి, రవి ప్రకాశ్ డీఐజీగా , రాజకుమారి ఏపీఎస్పీ డీఐజీగా , సర్వ శ్రేష్ట త్రిపాఠిని అడ్మిన్ డీఐజీగా బదిలీ చేసింది. కోయ ప్రవీణ్ ను గ్రే హౌండ్స్ డీఐజీగా , శంక బ్రత బాగ్చి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ , రవి శంకర్ అయ్యనార్ అడిషనల్ డీజీ, అతుల్ సింగ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది.
పి. వెంకట్రామిరెడ్డికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం త్రివిక్రమ్ వర్మను విశాఖ సిటీ కమిషనర్ గా నియమించింది.
Also Read : సీఎం కేసీఆర్ పై భగ్గుమన్న బండి