Terrorists : హర్యానాలో పేలుడు పదార్థాలతో వెళుతున్న పాకిస్తాన్ తో సంబంధం కలిగిన నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను( Terrorists) అరెస్ట్ చేశారు.
టయోటా ఇన్నోవా ఎస్ యూ వీలో ఢిల్లీకి వెళుతుండగా గురువారం తెల్ల వారుజామున 4 గంటలకు కర్నాల్ లోని బస్తారా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర లోని నాందేడ్ , తెలంగాణలోని ఆదిలాబాద్ కు పేలుడు పదార్థాలను తీసుకు వెళుతున్నట్లు చెప్పారు.
అరెస్ట్ చేసిన నలుగురు అనుమానిత ఉగ్రవాదుల్లో ( Terrorists)కీలక నిందితుడు గురు ప్రీత్ గతంలో జైలులో ఉన్నాడని చెప్పారు. అక్కడ పాకిస్తాన్ తో సంబంధాలు కలిగి ఉన్న రాజ్ బీర్ ను కలిశాడని వెల్లడించారు.
ఈరోజు అరెస్ట్ అయిన గుర్ ప్రీత్ , మరో ముగ్గురు పేలుడు పదార్థాలను భారత దేశం అంతటా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ నలుగురు టెర్రరిస్టులకు పాకిస్తాన్ గూఢ చర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ లేదా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
ఇక అరెస్ట్ చేసిన మిగిలిన ముగ్గురు నిందితులను పంజాబ్ కు చెందిన భూపిందర్, అమన్ దీప్ , పర్మీందర్ లుగా గుర్తించినట్లు వెల్లడించారు.
నలుగురు నిందితులు పాకిస్తాన్ నుంచి వారిని హ్యాండిల్ చేసిన మరో ఉగ్రవాది హర్వీందర్ సింగ్ నుంచి ఆర్డర్ తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో కంట్రీ మేడ్ పిస్టల్, 31 బుల్లెట్లు, ఐఈడీతో కూడిన మూడు ఇనుప కంటైర్లు కూడా ఉన్నాయని, రూ. 13 లక్షల నగదు కూడా లభించిందని వెల్లడించారు.
Also Read : భిల్వారాలో ఘర్షణ ఇంటర్నెట్ బంద్