4 Terrorists Killed : కాశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం
రెండు వేర్వేరు ఘటనల్లో ఎన్ కౌంటర్
4 Terrorists Killed : జమ్మూ , కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కంటిన్యూగా కొనసాగుతోంది. నిన్నటికి నిన్న వేర్వేరు ప్రాంతాల్లో ఏడు మందిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.
తాజాగా కాశ్మీర్ లో చోటు చేసుకున్న రెండు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు(4 Terrorists Killed). ఈ కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఒకరు జైషే అహ్మద్ సంస్థకు చెందిన వారు.
దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టుటు ఖతం అయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం భద్రతా బలగాలు సెర్చించ్ చేపట్టాయని తెలిపారు. రెండు వేర్వేరు ప్రాంతాలలో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు.
సోపోర్ ప్రాంతంలో లోని తులిబల్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు అక్కడ కార్బన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామన్నారు పోలీసు ఉన్నతాధికారి.
దీంతో అక్కడే ఉన్న టెర్రరిస్టులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారని , దీంతో సెర్చ్ ఆపరేషన్ చివరకు ఎన్ కౌంటర్ గా మారిందన్నారు.
ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మట్టు బెట్టామన్నారు. ఇక దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా లోని తుజ్జన్ లో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతమైనట్లు పోలీసులు తెలిపారు.
హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని జైషే మహ్మద్ కు చెందిన మాజిద్ నజీర్ గా గుర్తించినట్లు కశ్మీర ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట సబ్ ఇన్స్ పెక్టర్ ఫరూఖ్ అహ్మద్ మీర్ హత్య కేసులో నజీర్ హస్తం ఉందని చెప్పారు.
Also Read : తమిళనాడు సంస్థ రూ. 400 కోట్ల పన్ను ఎగవేత